SKN: ఏం మాట్లాడుతున్నావ్‌.. నరాలు కట్ అయిపోయాయ్‌: ఎస్‌కేయన్‌

‘రఫా’ ఘటన గురించి తెలిసే సినీ సెలబ్రిటీలు పోస్ట్‌ పెడుతున్నారా? ఇమేజ్‌ షేర్‌ చేస్తున్నారా? అని తెలుసుకోవాలనుందన్నారు నిర్మాత ఎస్‌కేయన్‌.

Published : 30 May 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిర్మాతల్లో ఎస్‌కేయన్‌ (SKN) ఒకరు. సినిమాల అప్‌డేట్స్‌ పంచుకోవడంతోపాటు ఇతర అంశాలపైనా ఆయన స్పందిస్తుంటారు. నెట్టింట ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘All Eyes on Rafah’ గురించి ఓ నటిని అడగ్గా తన సమాధానం విని షాక్‌ అయ్యానని పేర్కొన్నారు. దక్షిణ గాజాలోని రఫా నగరంలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో పలువురు పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. ఈ క్రమంలోనే ‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా’తో కూడిన ఇమేజ్‌ను షేర్‌ చేస్తూ  ఇండియన్‌ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కాల్పుల విరమణకు అభ్యర్థించారు. దీన్ని ఉద్దేశిస్తూనే ఎస్‌కేయన్‌ పోస్ట్‌ పెట్టారు.

‘‘తాము ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా’ గురించి సెలబ్రిటీలకు తెలుసా? సింపుల్‌గా పోస్ట్‌ను షేర్‌ చేస్తున్నారా?నాకు తెలుసుకోవాలనుంది. ఇండియాకు సంబంధించి ఎప్పుడూ ఇలాంటి పోస్ట్‌లు నేను చూడలేదు’’ అని నిర్మాత పేర్కొనగా.. దర్శకుడు పవన్‌ సాధినేని (Pavan Sadineni) రిప్లై ఇచ్చారు. ‘‘నాకు మరోలా అనిపిప్తోంది. అదేంటంటే.. ఫొటో బాగుందని షేర్‌ చేస్తున్నారా? సినిమా పోస్టర్‌ అనుకుని షేర్‌ చేస్తున్నారా? ఇలాంటి సున్నితమైన అంశం గురించి ఫొటో పోస్ట్‌ చేయడం కంటే చర్చించాల్సిన అవసరం ఉంది. మన దేశంలో జరుగుతున్న సామాజిక సమస్యలపై కూడా వారు అదే శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

ఎస్‌కేయన్‌: పేరు చెప్పలేను గానీ దీని గురించి ఓ వర్ధమాన హీరోయిన్‌ని అడిగితే.. అది కాన్సర్ట్‌ కాదా? అని సమాధానమిచ్చారు. దీంతో, ‘ఏం మాట్లాడుతున్నావ్‌.. నరాలు కట్‌ అయిపోయాయ్‌’ మీమ్‌ నా మైండ్‌లోకి వచ్చింది.

పవన్‌: నాదీ అదే పరిస్థితి. నేను అడిగితే.. ‘ఏదైనా మలయాళం సినిమానేమో’ అని ఓ హీరోయిన్‌ చెప్పింది. అందరూ షేర్‌ చేస్తుంటే.. స్పెయిన్‌ క్రీడాకారుడు రఫెల్‌ నాదల్‌కు ఏమైందో అని గూగుల్ చేశా. ఆ సెర్చ్‌ ఇంజిన్‌ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. అంటూ తమకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు