Kalki 2898AD: ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్‌ ఆసక్తికర కామెంట్స్‌

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

Published : 23 Mar 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాపై నిర్మాత స్వప్నదత్‌ (Swapna Dutt) ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ పోషిస్తున్న భైరవ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని అన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ‘సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌’ వేదికపై ఆమె మాట్లాడారు. సంబంధిత విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రొడ్యూసర్‌ వ్యాఖ్యలపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ భారీ బడ్జెట్‌ చిత్రం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కాన్సెప్ట్‌ గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘మహాభారతంతో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా ఆయా ప్రపంచాల్ని సృష్టించడానికి ప్రయత్నించాం. ఆ ప్రపంచాలు కూడా భారతీయతని ప్రతిబింబించేలా ఊహించుకుంటూ మలిచాం. హాలీవుడ్‌లో విడుదలైన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘బ్లేడ్‌ రన్నర్‌’ పోలికలు ఇందులో కనిపించనీయలేదు. అది మాకు పెద్ద సవాల్‌గా మారింది’’ అని తెలిపారు. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని