Project z ott: ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్‌ ‘ప్రాజెక్ట్‌-జెడ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ‘ప్రాజెక్ట్‌-Z’ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది.

Published : 27 May 2024 15:41 IST

హైదరాబాద్: సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ చిత్రం ‘మాయవన్‌’. దాదాపు ఏడేళ్ల కిందట అక్కడ విడుదలైన ఈ సినిమాను ఇటీవల ‘ప్రాజెక్ట్‌-Z’ (Project Z) పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకువచ్చిన సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో సీవీ కుమార్ దీన్ని తెరకెక్కించారు. జాకీష్రాఫ్, దివంగత నటుడు డేనియల్ బాలాజీ, జయప్రకాష్, దర్శకుడు కే ఎస్ రవికుమార్, మైమ్ గోపీ, భాగవతి పెరుమాళ్ కీలక పాత్రలు పోషించారు. సందీప్‌కిషన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించారు. బాక్సాఫీస్‌ వద్ద అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో మే 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ (Project Z Movie) కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ప్రచార చిత్రాన్ని పంచుకుంది.

కథేంటంటే: కుమార్‌ (సందీప్‌ కిషన్‌) క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌. ఓ చిల్లర దొంగను పట్టుకునే క్రమంలో జిమ్‌ ట్రైనర్‌ (సాయి దీనా) అతని భార్యను హత్య చేయడం చూస్తాడు. రక్తం చూడగానే కుమార్‌ మొదట భయాందోళనకు గురైనా వెంటనే తేరుకొని, హంతకుడైన జిమ్‌ ట్రైనర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగి జిమ్‌ ట్రైనర్‌ను కుమార్‌ పొడవటంతో అతడు అక్కడికక్కడే మరణిస్తాడు. తీవ్ర గాయాలపాలైన కుమార్‌ కోలుకున్న తర్వాత ఉద్యోగంలో తిరిగి చేరడానికి మెంటల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కావాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సైకోథెరపిస్ట్‌ అదిర (లావణ్య త్రిపాఠి)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. మరోవైపు నగరంలో వరుసగా ఒకే తరహా హత్యలు జరుగుతాయి. మరి ఆ హత్యలు చేస్తున్నది ఎవరు? రక్తం చూస్తే భయపడిపోయే కుమార్‌ గతం ఏంటి?(Project Z Movie) వరుస హత్యలను ఛేదించడానికి వెళ్లిన అతడి టీమ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి?అన్నది కథ.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని