Pushpa2TheRule: పుష్పగాడి రూల్‌ మొదలైంది.. ‘పుష్ప 2’ టీజర్‌ వచ్చేసింది..!

అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్’. సుకుమార్‌ దర్శకుడు. 

Published : 08 Apr 2024 11:19 IST

హైదరాబాద్‌: సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule). అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తోన్న చిత్రమిది. రష్మిక (Rashmika) కథానాయిక. సోమవారం అల్లు అర్జున్‌ పుట్టినరోజు పురస్కరించుకుని చిత్రబృందం స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘పుష్ప ది రూల్‌’ టీజర్‌ విడుదల చేసింది. సినిమాలో కీలకంగా సాగే జాతర సన్నివేశాలతో ఇది సిద్ధమైంది. మాస్‌ అవతార్‌లో బన్నీ లుక్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు ఈలలు వేయించేలా ఉన్నాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్‌’. 2021లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఎర్రచందనం కూలీ నుంచి స్మగ్లింగ్‌ సిండికేట్‌కు నాయకుడిగా పుష్ప ఎలా ఎదిగాడని మొదటి భాగంలో చూపించారు. మరి, సిండికేట్‌కు లీడర్‌ అయ్యాక పుష్పకు ఎదురైన సవాళ్లు ఏమిటి? మంగళం శ్రీను, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌, దాక్షాయణి నుంచి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందనే అంశాలతో ‘పుష్ప ది రూల్‌’ సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని