Pushpa2: ఇది కదా.. ‘పుష్ప’ రేంజ్‌.. రూల్‌ చేయడానికి వచ్చేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ విడుదల చేసే టైమ్‌ను తెలియజేస్తూ చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

Updated : 07 Apr 2024 18:09 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ (Allu arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa2: The Rule). ‘పుష్ప1’కు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేయనుంది. సోమవారం అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11.07 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చెబుతూ సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది.  ‘అతడు అన్ని అడ్డంకులను దాటుకుని పైకెదిగాడు.. ఇప్పుడు రూల్‌ చేయడానికి వస్తున్నాడు’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. పోస్టర్‌లో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ చేతిలో గొడ్డలి పట్టుకుని, కుర్చీలో కూర్చొని తీక్షణంగా చూస్తున్న ఫొటో పోస్ట్‌ చేసిన నిమిషాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

ఇటీవల రష్మిక పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె పోషిస్తున్న శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఫొటోను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. పట్టుచీర కట్టుకుని, బంగారు ఆభరణలు ధరించి చేతి వేళ్ల మధ్య నుంచి ఒక కన్నుతో చూస్తున్న ఆ ఫొటోకు అభిమానులు ఫిదా అయ్యారు. శ్రీవల్లి ఫుల్‌ రిచ్‌ అయిపోయిందంటూ కామెంట్లు పెట్టారు. ఇప్పుడు బన్నీ పోస్టర్‌ చూసి ‘తగ్గేదేలే’.. ‘మాస్‌.. ఊర మాస్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని