PV Sindhu: ప్రభాస్‌ నటన అంటే ఇష్టమే కానీ..: పీవీ సింధు

ప్రభాస్‌ నటన అంటే తనకు ఇష్టమని పీవీ సింధు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె టాలీవుడ్‌ హీరోలపై అభిప్రాయం వ్యక్తం చేశారు.

Published : 13 Feb 2024 19:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో ప్రభాస్‌ (Prabhas) అంటే తనకు ఇష్టమేగానీ ఇప్పటి వరకు సమావేశం కాలేదని, కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు (PV Sindhu) అన్నారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె.. స్పోర్ట్స్‌ జర్నీతోపాటు టాలీవుడ్‌ కథానాయకుల గురించి మాట్లాడారు. సంబంధిత క్లిప్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘ప్రభాస్‌తో ఎప్పుడైనా సమావేశమయ్యారా?’ అన్న ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. ప్రభాస్‌ బాగా యాక్ట్‌ చేస్తారని, ఆయన సినిమాలు చూస్తుంటానని తెలిపారు. రామ్‌ చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (NTR) నటన కూడా ఇష్టమన్నారు. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) సినిమాల్లో కొన్ని నచ్చాయన్నారు. ‘ఏయే చిత్రాలు నచ్చలేదు?’ అని అడగ్గా చెబితే కాంట్రవర్సీ అవుతుందంటూ నవ్వారు. క్రీడాకారుల్లాగే సినిమా వాళ్లకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నారు. తాను వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సందర్భంగా 2021లో చిరంజీవి ఇంటికి ఆహ్వానించి, సత్కరించడాన్ని గుర్తుచేసుకున్నారు.

సింధు సినిమాలు ఎక్కువగా చూస్తుంటారు. చూడడమే కాకుండా వాటిపై సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. ఇటీవల బాలీవుడ్‌ మూవీ ‘ఫైటర్‌’ (Fighter)పై పోస్ట్‌ పెట్టారు. దానిపై, హీరోయిన్‌ దీపికా పదుకొణె స్పందిస్తూ ‘లవ్‌ యూ’ అని కామెంట్‌ పెట్టారు. హృతిక్ రోషన్‌- దీపిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన సినిమా ఇది. జనవరి 25న విడుదలైంది. ‘భవిష్యత్తులో మిమ్మల్ని హీరోయిన్‌గా చూడొచ్చా?’ అనే ప్రశ్న గతంలో ఓ సందర్భంలో ఎదురవగా .. ‘ఏమో నా బయోపిక్‌ తీయొచ్చేమో. నాతో తీస్తేనే నేచురల్‌గా ఉంటుంది కదా’ అని సమాధానమిచ్చారు. సినీ రంగానికి చెందిన వారిని వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని