Rahul ravindran: గుజరాత్‌తో నేడు హైదరాబాద్‌ మ్యాచ్‌.. నెటిజన్లకు రాహుల్‌ రవీంద్రన్‌ సారీ

ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌, గుజరాత్‌ నేడు తలపడనున్నాయి.

Published : 31 Mar 2024 12:12 IST

హైదరాబాద్‌: గుజరాత్‌, హైదరాబాద్‌ల మధ్య ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ను ఉద్దేశించి దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. తనని మ్యాచ్‌ చూడొద్దని చెప్పిన పలువురు నెటిజన్లకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఇంతకీ ఆయన్ని మ్యాచ్‌ ఎందుకు చూడొద్దన్నారంటే..?

రష్మిక కథానాయికగా రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. షూట్‌ కారణంగా మార్చి 27న హైదరాబాద్‌ - ముంబయి మ్యాచ్‌ను రాహుల్‌ పూర్తిగా చూడలేకపోయారు. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ పూర్తయ్యాక మ్యాచ్‌ చూశానని పోస్ట్‌ పెట్టారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ జరిగినప్పుడు దయచేసి మీరు షూట్స్‌లోనే ఉండండి’’, ‘‘హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ చూడకపోతే భారీగా పరుగులు వచ్చాయి. సీజన్‌ పూర్తి అయ్యేవరకూ మన టీమ్‌ మ్యాచ్‌లు మీరు చూడొద్దు’’ అంటూ కామెంట్స్‌ చేశారు. వీటిపై స్పందించిన ఆయన ‘‘మ్యాచ్‌ అప్‌డేట్‌: ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ షూటింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌  మొన్ననే పూర్తైంది. చిత్రీకరణలోనే ఉండాలని చెబుతున్న వారందరికీ నా క్షమాపణలు’’ అని పోస్ట్‌ పెట్టారు. నేటి మ్యాచ్‌పై రష్మిక కూడా స్పందిస్తూ.. ‘‘ఆర్‌సీబీకి నేను వీరాభిమానిని. కానీ, ఈరోజు సన్‌రైజర్స్‌ గెలవాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు.

గత మ్యాచ్‌లో ముంబయిపై హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. బ్యాటర్ల వీర విహారంతో 277 పరుగులు చేసి.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్‌రైజర్స్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని