Rajamouli: డ్యాన్స్‌తో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్‌

దర్శకుడు రాజమౌళి (Rajamouli) డ్యాన్స్‌తో అదరగొట్టారు. సతీమణి రమతో కలిసి ప్రభుదేవా పాటకు స్టెప్పులేశారు.

Updated : 01 Apr 2024 12:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వర్క్‌ విషయంలో ఎంతో సీరియస్‌గా ఉండే దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli).. పర్సనల్‌ లైఫ్‌లో సరదాగా ఉంటారు. కుటుంబంతో కలిసి ప్రతి క్షణాన్ని ఆస్వాదించే ఆయన.. మరోసారి డ్యాన్స్‌తో అలరించారు. ప్రభుదేవా పాటకు స్టెప్పులేశారు. తన సతీమణి రమతో కలిసి ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే’ పాటకు స్టేజ్‌పై డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘వావ్‌.. సూపర్‌గా డ్యాన్స్‌ చేశారు’ అంటూ పలువురు కామెంట్స్‌ పెడుతున్నారు.

సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన మహేశ్‌బాబుతో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. #SSMB29గా ఇది ప్రచారంలో ఉంది. యాక్షన్‌ అడ్వెంచర్‌గా సిద్ధం కానుంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ భాగం కానున్నారు. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని సమాచారం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని