Rajinikanth: నటుడి మనవరాలి వివాహ వేడుకలో రజనీకాంత్‌.. ఫొటోలు వైరల్‌

సీనియర్‌ నటుడి మనవరాలి వివాహ వేడుకలో ప్రముఖ హీరో రజనీకాంత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Published : 19 Feb 2024 18:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు విజయ్‌ కుమార్‌ (Vijay Kumar) మనవరాలు దియా వివాహం సోమవారం అట్టహాసంగా జరిగింది. చెన్నైలోని ఓ హోటల్‌ ఈ వేడుకకు వేదికైంది. రజనీకాంత్‌ (Rajinikanth) హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. ఆయన హోటల్‌లో అడుగుపెట్టే దృశ్యాలు, విజయ్‌కుమార్‌ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. విజయ్‌కుమార్‌కు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. వారిలో వైద్యురాలైన అనిత తనయ ఈ దియా. వనిత, ప్రీత, శ్రీదేవి, అరుణ్‌, విజయ్‌ నటులుగా స్థిరపడ్డారు. కవిత పలు చిత్రాల్లో నటించారు.

రజనీకాంత్‌- విజయ్‌కుమార్‌ ఎప్పటినుంచో స్నేహితులు. రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘బాషా’, ‘చంద్రముఖి’, ‘బాబా’ తదితర చిత్రాల్లో విజయ్‌ కీలకపాత్రలు పోషించారు. ఈ డబ్బింగ్‌ సినిమాలకంటే ముందు ‘గీతాంజలి’, ‘లారీ డ్రైవర్‌’, ‘కిల్లర్‌’ వంటి స్ట్రైట్‌ తెలుగు ఫిల్మ్స్‌లో నటించి, ఇక్కడి ప్రేక్షకులను అలరించారు. రజనీకాంత్‌ ప్రస్తుతం ‘వేట్టయాన్‌’ (Vettaiyan)తో బిజీగా ఉన్నారు. ‘జై భీమ్‌’ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది పూర్తయ్యాక లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో నటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని