Shah Rukh Khan: ‘డంకీ’ వసూళ్ల గురించి షారుక్‌ ముందే చెప్పారు: రాజ్‌ కుమార్‌ హిరాణీ

‘డంకీ’ కలెక్షన్ల విషయంలో షారుక్‌ చెప్పినట్లే జరుగుతోందని దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ తెలిపారు.

Published : 01 Jan 2024 17:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా అగ్ర దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ తెరకెక్కించిన చిత్రం ‘డంకీ’. ఈ సినిమాకు ముందు షారుక్‌ నటించిన రెండు సినిమాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ‘డంకీ’పై అభిమానులంతా భారీగా ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ చిత్రం కలెక్షన్ల గురించి దర్శకుడు (Rajkumar Hirani ) ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

‘‘షారుక్‌ ఖాన్‌ ఈ ఏడాదిలో ‘డంకీ’ (Dunki) కంటే ముందు నటించిన రెండు చిత్రాలు పూర్తి స్థాయి యాక్షన్‌ జోనర్‌కు చెందినవి. ఈ సినిమా కథ వాటికి భిన్నంగా ఉంటుంది. షారుక్‌ చాలా తెలివైన హీరో. ఆయనకు ప్రేక్షకుల నాడి తెలుసు. అందుకే ఈ సినిమా వసూళ్ల గురించి ముందే చెప్పారు. విడుదలైన వెంటనే భారీ కలెక్షన్లు రావని.. సినిమా ప్రజల్లోకి వెళ్లాక మంచి వసూళ్లు వస్తాయన్నాడు. రిలీజైన కొన్ని రోజులకు ఫ్యామిలీ ఆడియన్స్‌ దీనికి క్యూ కడతారన్నారు. ప్రస్తుతం అతడు చెప్పినట్లే జరుగుతోంది. మొదట్లో కంటే ఇప్పుడు ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది. షారుక్‌తో కలిసి పనిచేయాలని దర్శకులంతా కోరుకుంటారు. నాకు ఆ అవకాశం రావడానికి 20 ఏళ్లు పట్టింది. నేను షారుక్‌తో సినిమా తీస్తున్నానని 91ఏళ్ల మా అమ్మకు చెప్పగానే ఆమె ఎంతో సంబరపడింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ అతడికి అభిమానులే. ఇక ఈ చిత్రం కోసం టీమ్‌లోని వారంతా ఎంతో కష్టపడ్డారు. అందరి కంటే షారుక్‌ కాస్త ఎక్కువ ప్రాక్టీస్‌ చేశారు. షూటింగ్‌కు ముందు రిహార్సల్స్‌ చేసిన వీడియోలన్నీ నాకు పంపేవాడు. వాటితో నా ఫోన్‌ మొత్తం నిండిపోయేది ’’ అని చెప్పారు. డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డంకీ’ ఇప్పటి వరకు రూ.360కోట్లు(గ్రాస్‌) వసూళ్లు చేసినట్లు చిత్రబృందం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు