Rakul Preet Singh: 1000 కిలోమీటర్లు డ్రైవ్‌ చేసి.. రకుల్‌ని కలిసి.. నటి ఎమోషనల్‌

నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh)ను కలిసేందుకు ఆమె అభిమాని స్కూటీపై వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాడు.

Published : 12 Oct 2023 17:34 IST

ముంబయి: నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (Rakul Preet Singh)ను కలిసేందుకు ఓ అభిమాని సాహసం చేశాడు. దాదాపు వెయ్యి కిలోమీటర్లు డ్రైవింగ్‌ చేసుకుంటూ ముంబయి వెళ్లాడు. ఆమెతో కలిసి ఫొటో కూడా దిగాడు. అభిమాని చూపించిన ప్రేమపై రకుల్‌ ఆనందం వ్యక్తం చేశారు. అతడికి సారీ కూడా చెప్పారు.

ott movies: ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో నటించి దక్షిణాదిలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. తమిళనాడుకు చెందిన కామేశ్‌ ఆమెకు వీరాభిమాని. ఈ క్రమంలోనే అక్టోబర్‌ 10న రకుల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమెను కలవాలని కామేశ్‌ అనుకున్నాడు. తన ద్విచక్ర వాహనంపై దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణించి ముంబయికి చేరుకున్నాడు. అనంతరం ఆమెను కలిసి.. బర్త్‌డే విషెస్‌ తెలిపి ఓ బహుమతి అందించాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై రకుల్‌ స్పందించారు. ‘‘థ్యాంక్యూ సో మచ్‌. మీరు నాపై చూపించిన ప్రేమకు ఎమోషనల్‌గా అనిపించింది. మీరు ఇంత దూరం ప్రయాణించాల్సి వచ్చినందుకు సారీ’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. సినిమాల విషయానికి వస్తే శివ కార్తికేయన్‌ ‘అయాలన్‌లో రకుల్‌ కథానాయికగా నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని