ott movies: ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

ott movies this week: ఈ వారం థియేటర్‌లో అన్నీ చిన్న చిత్రాలే సందడి చేస్తుండగా, ఓటీటీలో పలు ఆసక్తికర సినిమాలు వస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటి? ఏయే వెబ్‌సిరీస్‌లు ఎక్కడ స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి? తెలుసుకోండి.

Published : 12 Oct 2023 11:56 IST

ప్రేమ ప్రయాణం..

సంగీత్‌ శోభన్‌, శాన్వీ మేఘన జంటగా నటిస్తున్న తెలుగు చిత్రం ‘ప్రేమ విమానం’ (prema vimanam). సంతోష్‌ కట దర్శకుడు. అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విమానం ఎక్కాలని ప్రయత్నించే కొందరి జీవితాల నేపథ్యంలో ఇది రూపొందింది. అనసూయ, వెన్నెల కిశోర్‌, దేవాన్ష్‌ నామా, అనిరుధ్‌ నామా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. విమాన ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలను ఇందులో చూపించనున్నారు. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.


థియేటర్‌లో అదరగొట్టి..

విశాల్‌ (Vishal) కథానాయకుడిగా అదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ‘మార్క్‌ ఆంటోని’ (Mark Antony).  గత 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ఏకంగా రూ.100కోట్ల వసూళ్లను రాబట్టింది. విశాల్‌, ఎస్‌జే సూర్యల నటన ప్రేక్షకులను అలరించింది. మరీ ముఖ్యంగా జాకీ మార్తాండ పాత్రలో ఎస్‌జే జీవించారు. తాజాగా ఈ సినిమా (mark antony ott release date) ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అక్టోబరు 13వ తేదీ నుంచి ‘మార్క్‌ ఆంటోనీ’ స్ట్రీమింగ్‌ కానుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తెలిపింది.


మరో పల్లె కథ

వైవిధ్య‌మైన క‌థాంశంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన చిత్రం ‘మట్టి కథ’ (Matti Katha). ప‌వ‌న్ క‌డియాల తెరకెక్కించిన ఈ మూవీ ఇండో ఫ్రెంచ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్‌లో ఏకంగా తొమ్మిది అవార్డుల‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధమైంది. ‘ఆహా’లో అక్టోబ‌ర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.


సస్పెన్స్ థ్రిల్లర్

అభినవ్ సర్దార్ ప్రధాన పాత్రలో చిత్రం ‘మిస్టేక్’ (Mistake). ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. అక్టోబర్‌ 13 నుంచి ‘ఆహా’లో ప్రసారం కానుంది. యాక్షన్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. భ‌ర‌త్ కొమ్మాల‌పాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్, సుజిత్, తేజ ఐనంపూడి కీలక పాత్రలు పోషించారు.


ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

 

  • నెట్‌ఫ్లిక్స్‌
  • గుడ్‌ నైట్‌ వరల్డ్‌ (జపనీస్‌) అక్టోబరు 12
  • ది ఫాల్‌ ఆఫ్ ది హౌస్‌ ఆఫ్ హజర్‌(ఇంగ్లీష్‌) అక్టోబరు 12
  • కాసర్‌గోల్డ్‌ (మలయాళం) అక్టోబరు 13

  • క్యాంప్‌ కరేజ్‌ (ఉక్రెయిన్‌) అక్టోబరు 15
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ఎవ్రీబడీ లవ్‌స్‌ డైమండ్స్‌ (ఇటాలియన్‌) అక్టోబరు 13
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • మతగం (తమిళం) స్ట్రీమింగ్‌ అవుతోంది.

  • గూస్‌ బంప్స్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 13
  • సుల్తాన్‌ ఆఫ్ ఢిల్లీ (హిందీ) అక్టోబరు 13
  • జియో సినిమా
  • కమింగ్‌ అవుట్‌ విత్‌ ద హెల్ప్‌ ఆఫ్‌ ఎ టైమ్‌ మెషీన్‌ (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ది లాస్ట్‌ ఎన్వలప్‌ (హిందీ) అక్టోబరు 12
  • మురాఖ్‌ - ది ఇడియట్‌ (హిందీ) అక్టోబరు 13
  • రింగ్‌ (హిందీ) అక్టోబరు 15
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని