Rakul Preet Singh: ట్రెండింగ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. కారణమిదే!

నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ భారీ ప్రాజెక్ట్‌లో ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.

Published : 10 Feb 2024 16:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఆమె పెళ్లిపై వస్తోన్న వార్తలతో పాటు తాజాగా ఓ భారీ బడ్జెట్‌లో ఆమెను ఎంపిక చేసినట్లు ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లతో కలిసి నిర్మాత అల్లు అరవింద్‌ రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం చిత్రబృందం రకుల్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) దాదాపుగా ఖాయమయ్యారు. సీత పాత్ర కోసం సాయిపల్లవి, జాన్వీకపూర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక మరో ముఖ్యమైన శూర్పణఖ పాత్రలో రకుల్‌ను ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కోసం మూవీ యూనిట్‌ ఆమెను సంప్రదించగా వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే లుక్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రావణుడిగా యశ్‌ (Yash), విభీషణుడిగా విజయ్‌ సేతుపతి, హనుమంతుడిగా బాబీ దేవోల్‌ కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో తన వాయిస్ మాడ్యులేషన్‌ కోసం రణ్‌బీర్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు టాక్‌. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

‘సైంధవ్‌’లో ఈ మార్పులు చేసుంటే బాగుండేది..: పరుచూరి గోపాలకృష్ణ

మరోవైపు రకుల్‌ ప్రీత్ సింగ్‌ పెళ్లికి సంబంధించిన వార్త కూడా ప్రస్తుతం ఎక్స్‌లో చక్కర్లు కొడుతోంది. జాకీ భగ్నానీ (Jackky Bhagnani)తో రకుల్‌ పెళ్లి ఫిబ్రవరి 22న గోవాలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన పనులు మొదలయ్యాయంటున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందని, ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం ముంబయిలో రిసెప్షన్‌ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రకుల్‌ తన స్నేహితులకు గోవాలో పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పొటోలు కూడా వైరలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని