Ram Charan: రాజమౌళి ‘మార్వెల్ మూవీస్’కు దర్శకత్వం వహిస్తే పార్టీ ఇస్తాను..:రామ్ చరణ్
ఓ విదేశీ మీడియాకు రామ్ చరణ్ (Ram Charan) ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మాట్లాడుతూ రాజమౌళి ‘మార్వెల్ మూవీస్’కు దర్శకత్వం వహిస్తే తాను పార్టీ ఇస్తానని తెలిపారు.
ఇంటర్నెట్‌డెస్క్: ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ప్రమోట్ చేయడం కోసం రామ్ చరణ్ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీమ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. తాజాగా రామ్ చరణ్ (Ram Charan) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మార్వెల్ చిత్రాలకు రాజమౌళి దర్శకత్వం వహిస్తే తాను పార్టీ ఇస్తానని చెప్పారు.
‘‘రాజమౌళి మార్వెల్ మూవీస్‌కు దర్శకత్వం వహించాలని నేను ఆశిస్తున్నాను. అదే జరిగితే.. అప్పుడు అందరికీ పార్టీ ఇస్తాను. నేను వాళ్ల ప్రతి సినిమాలో ఉండాలని అనుకుంటాను. ప్రస్తుతం సినిమారంగానికి ఎలాంటి హద్దులు లేవు. హాలీవుడ్, బాలీవుడ్ అనే భేదాలు లేవు. అలాంటి ఓ రంగంలో భాగమైనందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. ఇక చిరంజీవి గురించి చెబుతూ..‘‘మా అందరికీ ఇది భావోద్వేగమైన క్షణాలు. నేను అమెరికా రాబోయే ముందు నాన్న ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆయన తన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు. 80వ దశకంలో ఓసారి ఆస్కార్ వేడుకకు హాజరయ్యారు. అదే భారీ విజయంగా భావించారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని పాట ఆస్కార్‌కు నామినేట్ అయిందని తెలిసినప్పుడు ఎంతో ఆనందించారు. ఆస్కార్ అవార్డు కోసం కొన్ని కోట్లమంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. మాకు ఆస్కార్ సాధించడం ఒలింపిక్‌లో బంగారు పతకం లాంటిది’’ అని రామ్ చరణ్ తెలిపారు.
ఇక మరోవైపు ఆస్కార్ వేదికపై తాము డ్యాన్స్ చెయ్యడంలేదని తారక్ వెల్లడించారు. సినిమా ప్రమెషన్స్‌లో బిజీగా ఉన్న కారణంగా రిహార్సల్స్ చేసే సమయం లేదని చెప్పారు. కీరవాణి, ఆయన బృందం కలిసి ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటను పాడతారని ఎన్టీఆర్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
TATA IPL 2023: ఐపీఎల్ వ్యాఖ్యాతగా నందమూరి బాలకృష్ణ
-
Politics News
Azad: రాహుల్‌పై వేటు: ఇలాగైతే.. పార్లమెంట్, అసెంబ్లీలు ఖాళీయే: ఆజాద్
-
Sports News
MIW vs DCW: ముగిసిన దిల్లీ ఇన్నింగ్స్.. ముంబయి లక్ష్యం 132
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
OneWeb: వన్‌వెబ్ కాన్స్టలేషన్ సంపూర్ణం.. కక్ష్యలోకి 618 ఉపగ్రహాలు
-
Sports News
wWBC: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో లవ్లీనాకు స్వర్ణం