Ram Charan: సందేహాలకు ఫుల్‌స్టాప్.. RC 16 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
రామ్‌చరణ్ తేజ్ తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో ఈ సినిమా చేయనున్నారు.
హైదరాబాద్: శంకర్ సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (Ram Charan) ఎవరితో సినిమా చేయనున్నారనే విషయంపై ఎంతో కాలం నుంచి సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది దర్శకుల పేర్లూ వినిపించాయి. ఈ సందేహాలకు తెరదించుతూ తాజాగా ‘ఆర్‌సీ 16’పై అధికారిక ప్రకటన వెలువడింది. చరణ్ తదుపరి చిత్రాన్ని ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో ఇది తెరకెక్కనుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ మైత్రి టీమ్ ఓ ట్వీట్ చేసింది. ‘‘కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమే అవుతుంది’’ అని పేర్కొంటూ #RamCharanRevolts అనే ట్యాగ్‌ను జత చేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈచిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు ‘ఆర్‌సీ 16’ని రామ్‌చరణ్ మొదట గౌతమ్ తిన్ననూరితో ప్రకటించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండనుందని అప్పట్లో టీమ్ ప్రకటించింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఇక, రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. RC 15గా ఇది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Taraka Ratna: మెదడు సంబంధిత సమస్య మినహా తారకరత్న క్షేమం: విజయసాయిరెడ్డి
-
India News
బడ్జెట్ అంశాలు లీకవడంతో.. పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి
-
Sports News
Hanuma Vihari: విహారి ఒంటి చేత్తో.. మణికట్టు విరిగినా బ్యాటింగ్
-
Ts-top-news News
Samathamurthy: నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు
-
Crime News
Crime News: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్