Varun-Lavanya: లావణ్య త్రిపాఠి బ్యాచులరేట్‌ పార్టీ.. టస్కానీలో రామ్‌చరణ్‌ దంపతులు..!

వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ వేడుకగా జరుగుతున్నాయి. తాజాగా బ్యాచులరేట్‌ పార్టీ నిర్వహించారు.

Published : 22 Oct 2023 12:03 IST

హైదరాబాద్‌: వరుణ్‌ తేజ్‌ (Varun Tej) - లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి లావణ్య త్రిపాఠి బ్యాచులరేట్‌ పార్టీ జరిగింది. ఆమె స్నేహితులు నీరజ, నితిన్‌ సతీమణి షాలినీ, నిహారిక, రీతూవర్మ తదితరులు పాల్గొన్నారు. కాబోయే వధువుకు అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

జాతీయ అవార్డుల విజేతలకు మైత్రి గ్రాండ్‌ పార్టీ.. ఫొటోలు వైరల్‌

కొద్ది మంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో తమ పెళ్లి జరగాలని భావిస్తున్న వరుణ్‌ తేజ్‌ - లావణ్య జంట.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ప్లాన్‌ చేసింది. ఇటలీలోని టస్కానీని వేదికగా ఎంచుకున్నారు. నవంబర్‌ 1న వరుణ్‌ - లావణ్య వివాహం జరగనుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రామ్‌చరణ్‌ (Ram Charan) - ఉపాసన (Upasana) దంపతులు తాజాగా టస్కానీ చేరుకున్నారు. అక్కడి పరిసరాలను చూపిస్తూ తాజాగా ఉపాసన ఓ ఫొటోని షేర్‌ చేశారు. పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేందుకు ఈ జంట అక్కడికి వెళ్లిందని సమాచారం. కాబోయే వధూవరులు సైతం ఇటలీకి పయనమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని