RGV: అమితాబ్ బచ్చన్‌తో రామ్‌గోపాల్‌ వర్మ.. నెటిజన్ల రియాక్షనిదే

అమితాబ్ బచ్చన్‌తో కలిసి రామ్ గోపాల్‌ వర్మ దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 28 Feb 2024 16:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. తన సినిమా విషయాలతో పాటు ప్రస్తుత పరిస్థితులపైనా స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఓ ఫొటో షేర్‌ చేశారు. బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)తో కలిసి దిగిన ఆ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘ఆర్జీవీ డెన్‌లో బిగ్‌బీ’ అని దానికి క్యాప్షన్‌ పెట్టారు.

ఇక ఈ ఫొటో చూసిన నెటిజన్లు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా రానుందంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్‌ ‘సర్కార్‌’ అనే బాలీవుడ్‌ చిత్రంలో నటించారు. 2005లో విడుదలైన ఆ చిత్రం విజయాన్ని అందుకుంది. పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆ సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో సినిమా వస్తుందో, లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్‌ తేజ్‌ అలా.. ‘టిల్లు’ ఇలా!

ప్రస్తుతం అమితాబ్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో నటిస్తోన్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది రానుంది. ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోన్న ఈ చిత్రంలో దిశా పటానీ,  కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో పాటు రజనీకాంత్‌ హీరోగా టి.జె.జ్ఞానవేల్‌ రూపొందిస్తోన్న ‘వేట్టయాన్‌’లోను అమితాబ్‌ నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని