Ramoji film academy: రామోజీ అకాడమీ ఉచిత ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సులు

రామోజీ గ్రూపు సంస్థలకు చెందిన రామోజీ అకాడమీ ఆఫ్‌ మూవీస్‌(ఆర్‌ఏఎం) తెలుగులో ఉచిత ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సులను అందించనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది

Updated : 02 Apr 2024 17:05 IST

రామోజీ గ్రూపు సంస్థలకు చెందిన రామోజీ అకాడమీ ఆఫ్‌ మూవీస్‌(ఆర్‌ఏఎం) తెలుగులో ఉచిత ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సులను అందించనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కోర్సులను ఆన్‌లైన్‌ ద్వారా అందించనున్నారు. ఇందులో భాగంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, యాక్షన్‌, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌, ఫిల్మ్‌ ఎడిటింగ్‌, డిజిటల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కనీస వయసు 15 సంవత్సరాలు, ఎంచుకున్న భాషలో నైపుణ్యం కలిగి ఉన్నవారు ఈ కోర్సులకు అర్హులు. సేఫ్‌ ఎగ్జామ్‌ బ్రౌజర్‌ (ఎస్‌ఈబీ) ద్వారా సురక్షితమైన దశలవారీగా అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ బ్రౌజర్‌లో కోర్సుకు సంబంధించి సబ్జెక్టుల గురించి పూర్తి విషయాలు ఉంటాయి.  తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్‌, తమిళ, మలయాళ, మరాఠీ, కన్నడ, బెంగాలీ భాషల్లోనూ ఈ కోర్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఆసక్తి కల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌లో చూడొచ్చు. www.ramojiacademy.com


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు