Rana Daggubati: రామ్‌చరణ్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన రానా.. ఇప్పుడు ఫ్యాన్స్‌ వంతు

రామ్‌చరణ్‌ విసిరిన ‘రెసిపీ’ ఛాలెంజ్‌ను రానా స్వీకరించి, ఆయన తన ఫ్యాన్స్‌కు విసిరారు. 

Published : 08 Sep 2023 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో ప్రస్తుతం ‘ఎంఎస్‌ఎంపీ రెసిపీ’ (#MSMPRecipeChallenge) ఛాలెంజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఇందులో భాగంగానే రామ్‌ చరణ్‌ (Ram Charan) విసిరిన ఛాలెంజ్‌ను రానా స్వీకరించారు. తనకు హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టమని తెలిపిన రానా (Rana Daggubati) దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తన అభిమానులకు ఛాలెంజ్‌ విసిరారు. తమకు నచ్చిన వంటకం గురించి షేర్‌ చేయమని విజ్ఞప్తి చేశారు. ఈ ఛాలెంజ్‌ వెనుక కథేంటంటే?

రివ్యూ: మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి

అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty) సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో అనుష్క.. చెఫ్‌ పాత్రలో నటించారు. ఆ క్యారెక్టర్‌కు తగ్గట్లు ఆమె తనకు బాగా నచ్చిన వంటకం మంగుళూరు చికెన్‌ కర్రీ, నీర్‌ దోశ తయారీ విధాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ #MSMPRecipeChallengeకి తెరలేపారు. ‘‘ఓ కొత్త ఛాలెంజ్‌ను మొదలుపెడుతున్నా. తొలుత దీన్ని ప్రభాస్‌కు విసురుతున్నా. భోజనాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తి.. అలాగే అతిథులను భోజనాలతో ఆశ్చర్యపరిచే వ్యక్తి ప్రభాస్‌. ఇప్పుడు ఇష్టమైన వంటకాన్ని ఎలా తయారు చేస్తారో ప్రభాస్‌ పోస్టు పెట్టాలి’’ అంటూ ఆయన్ను ట్యాగ్‌ చేశారామె.

ఈ ఛాలెంజ్‌ స్వీకరించిన ప్రభాస్‌.. రొయ్యల పులావ్‌ అంటే ఇష్టమని తెలిపారు. దాని తయారీ విధానాన్నీ పంచుకున్నారు. అనంతరం రామ్‌ చరణ్‌కు ఛాలెంజ్‌ విసరగా ఆయన స్వీకరించారు. తనకు చేపల పులుసు అంటే ఇష్టమని తెలుపుతూ దాన్ని తయారుచేసే విధానాన్ని ట్వీట్‌ చేశారు చరణ్‌. తాను రానాకు ఛాలెంజ్‌ విసురుతున్నట్లు పేర్కొన్నారు. అలా.. అనుష్కతో మొదలైన రెసిపీ ఛాలెంజ్‌ ఇలా కొనసాగుతోంది. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సెప్టెంబరు 7న విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని