Rana: ఇన్‌స్టాలో పోస్టులన్నీ తొలగించిన రానా.. కారణం అదేనట!

ప్రస్తుతం స్మార్ట్‌యుగంలో సినీ తారలను అభిమానులకు ఎంతగానో దగ్గర చేశాయి సామాజిక మాధ్యమ వేదికలు. తాము చేసే కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు,

Published : 10 Aug 2022 01:57 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం స్మార్ట్‌యుగంలో సినీ తారలను అభిమానులకు ఎంతగానో దగ్గర చేశాయి సామాజిక మాధ్యమ వేదికలు. తాము చేసే కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో నటుడు రానా(Rana) ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లోని అన్ని పోస్టులను డిలీట్‌ చేశారు. కొంతకాలం తాను సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ఆగస్టు 5న ప్రకటించిన ఆయన తాజాగా ఇన్‌స్టా పోస్టులను తీసేశారు.

‘కొంతకాలం సోషల్‌మీడియా నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. పెద్ద, ఉత్తమమైన, శక్తిమంతమైన చిత్రాలతో మళ్లీ కలుద్దాం, మీపై అమితమైన ప్రేమతో.. రానా’ అని ఆగస్టు 5న ట్వీట్‌ చేశారు. అన్నట్లుగానే ఇన్‌స్టా పోస్టులను డిలీట్‌ చేశారు. ఇక రానా సినిమాల విషయానికొస్తే, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘విరాటపర్వం’ మిశ్రమ స్పందనలు అందుకుంది. ప్రస్తుతం బాబాయ్‌ వెంకటేశ్‌తో కలిసి నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌ ‘రానానాయుడు’లో నటిస్తున్నారు. తేజతో సినిమా చేయనున్నట్లు ప్రకటించినా దానిపై మళ్లీ ఎలాంటి వార్తలూ రాలేదు. అలాగే ‘హిరణ్యకశ్యప’ అనే పౌరాణిక చిత్రం చేస్తానని కూడా రానా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని