Rajinikanth: రజనీకాంత్‌ సినిమాలో రానా.. అధికారికంగా ప్రకటించిన టీమ్

రజనీకాంత్‌ హీరోగా టి.జి జ్ఞానవేల్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రానా (Rana Daggubati) ఓ కీలక పాత్రలో కనిపంచనున్నారు.

Published : 03 Oct 2023 14:41 IST

హైదరాబాద్: ‘జైలర్‌’ విజయంతో ఫుల్‌జోష్‌లో ఉన్నారు హీరో రజనీకాంత్‌. ఇప్పుడు అదే స్పీడ్‌తో తన తర్వాత సినిమా పనులు మొదలుపెట్టేశారు. టి.జి జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ప్రకటించిన సినిమాకు సంబంధించిన వరుస అప్‌డేట్‌లను పంచుకుంటున్నారు. ‘తలైవా 170’ (Thalaivar 170) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం ప్రచారంలో ఉంది.

ఈ సినిమాలో టాలీవుడ్‌ నటుడు రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. గతంలో ఈ పాత్రకు సంబంధించి చాలా మంది నటుల పేర్లు వినిపించాయి. ముందుగా నాని పేరు తెరపైకి వచ్చింది. తర్వాత శర్వానంద్‌ (Sharwanand)ను తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా నిర్మాణ సంస్థ ట్వీట్‌తో వీటన్నింటికీ చెక్‌ పెట్టింది. రానా రాకతో ‘తలైవా 170’ మరింత ఆసక్తికరంగా మారిందంటూ పోస్టర్‌ను విడుదల చేసింది. 

ఓటీటీలో అక్షయ్‌ ‘ఓఎంజీ2’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. మంజూ వారియర్‌ (Manju Warrier), రితికా సింగ్‌ (Ritika Singh), దుషారా విజయన్‌ (Dushara Vijayan)లు ఇందులో నటిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన అగ్ర నటులను ఇందులో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), మలయాళం నుంచి ఫహాద్‌ ఫాజిల్‌ను కూడా తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని