OMG 2 ott release date: ఓటీటీలో అక్షయ్‌ ‘ఓఎంజీ2’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

omg 2 ott release date: అక్షయ్‌కుమార్‌, పంజక్‌ త్రిపాఠి కీలక పాత్రల్లో అమిత్‌ రాయ్‌ తెరకెక్కించిన ‘OMG2’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Published : 03 Oct 2023 13:17 IST

జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించే నటుడు అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar). ఆయన దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్‌’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఇటీవల ‘ఓ మై గాడ్‌ 2’ (OMG 2) విడుదలైంది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ‘OMG2’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది.

కథేంటంటే: కాంతి శరణ్‌ ముగ్దల్‌ (పంకజ్‌ త్రిపాఠి) ఆలయం పక్కనే పూజా స్టోర్‌ను నడుపుతుంటాడు. మహా శివ భక్తుడు. భార్య, కొడుకు వివేక్‌ (ఆరుష్‌ వర్మ)తో పాటు తన వద్దే ఉన్న తండ్రిని కూడా ముగ్దల్‌ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఒక రోజు వివేక్‌ అసభ్య ప్రవర్తన కారణంగా పాఠశాల నుంచి బహిష్కరణకు గురవుతాడు. అంతేకాదు, టాయ్‌లెట్‌లో అతడు చేసిన పనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. దీంతో పరువు పోయిందని భావించిన ముగ్దల్‌ కుటుంబాన్ని తీసుకుని ఆ ఊరు నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. అదే సమయంలో దేవదూత (అక్షయ్‌కుమార్‌) ప్రత్యక్షమవుతాడు. ముగ్దల్‌ కుమారుడు చేసిన పని భయపడి పారిపోకుండా దానిపై పోరాటం చేయాలని సూచిస్తాడు. మరి దేవదూత మాటలు విన్న ముగ్దల్‌ ఎలాంటి పోరాటం చేశాడు? అందుకు అతడు ఎంచుకున్న మార్గం ఏంటి? పరిస్థితి కోర్టు వరకూ ఎందుకు వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని