Rana naidu: ‘రానా నాయుడు’ రికార్డు.. భారత్‌ నుంచి ఇదొక్కటే..

‘రానా నాయుడు’ (Rana Naidu) వెబ్‌ సిరీస్ అరుదైన ఘనత సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూస్‌ సాధించిన సిరీస్‌గా నిలిచింది.

Published : 13 Dec 2023 12:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానా (Rana), వెంకటేశ్‌ (Venkatesh) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా విడుదలైన ఈ సిరీస్‌ వివాదాల్లో నిలిచినప్పటికీ.. బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సిరీస్ ఓ అరుదైన ఘనత సాధించింది. 2023 జనవరి నుంచి జూన్‌ వరకు ఎక్కువ వ్యూస్‌ వచ్చిన వాటి వివరాలను నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా వెల్లడించింది. ఇందులో ‘రానా నాయుడు’ చోటు దక్కించుకుంది. అంతేకాదు ఇండియా నుంచి ఈ ఒక్క సిరీస్‌ మాత్రమే ఉండడం విశేషం.

ఇక 2021 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ప్రతి వారం ఎక్కువ వ్యూస్‌ సాధించిన టాప్ 10 మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ విడుదల చేస్తూ వస్తోంది. ఈసారి ఆరు నెలల జాబితాను విడుదల చేసింది. వ్యూస్‌ ఆధారంగా సుమారు 18వేల టైటిల్స్‌ డేటాను పరిశీలించింది. గ్లోబల్‌గా ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకున్న టాప్‌ 400ను విడుదల చేసింది. ఇందులో ‘రానా నాయుడు’ టాప్‌ 336లో నిలిచింది. భారత్‌ నుంచి ఈ సిరీస్‌ మాత్రమే టాప్‌ 400లో స్థానం దక్కించుకుంది. దీన్ని 46 మిలియన్ల గంటలు చూసినట్లు ఆ సంస్థ తెలిపింది.

ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది..: త్రిప్తి డిమ్రీ

అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ఈ సిరీస్‌ రూపొందింది. దీని కోసం రానా, వెంకటేశ్‌ మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. యాక్షన్‌,  క్రైమ్‌ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు. అయితే.. కంటెంట్ విషయంలో పలు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీనికి సీక్వెల్‌ను కూడా రూపొందిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా వెల్లడించింది. మరెన్నో ట్విస్టులు, మరింత ఫ్యామిలీ డ్రామాతో ‘రానా నాయుడు-2’ త్వరలో విడుదల కానున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని