Rana: నేను టెర్మినేటర్‌ని.. శస్త్రచికిత్సలపై మరోసారి మాట్లాడిన రానా
తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలపై హీరో రానా మరోసారి స్పందించారు. తాను టెర్మినేటర్‌లాంటివాణ్ని అని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తన తొలి వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu) ప్రచారంలో బిజీగా ఉన్నారు ప్రముఖ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati). తన బాబాయ్, కథానాయకుడు వెంకటేశ్‌తో కలిసి నటించిన ఈ సిరీస్ ఇటీవల ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఓ ముఖాముఖిలో తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడారు. కిడ్నీ, కంటి సమస్యతో బాధపడినట్టు చెప్పారు.
‘‘కార్నియా ట్రాన్స్‌ప్లాంట్ (కంటికి సంబంధించిన) గురించి మాట్లాడే కొద్ది మంది వ్యక్తుల్లో నేనొకణ్ని అనుకుంటున్నా. నా కుడి కన్ను సరిగా కనిపించేది కాదు. కిడ్నీ సమస్య కూడా ఎదుర్కొన్నా. రెండింటికీ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ విషయంలో నేను టెర్మినేటర్‌ని అనుకుంటున్నా (నవ్వుతూ..). చాలా మంది శారీరక సమస్యలు వస్తే బాధపడుతుంటారు. కొన్నాళ్లకు ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినా ఫీల్ అవుతూనే ఉంటారు. అలాకాకుండా ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి ముందుకెళ్లాలి’’ అని రానా పేర్కొన్నారు. ఓ కార్యక్రమం వేదికగా 2016లో తన కంటి సమస్య గురించి రానా తొలిసారి మాట్లాడారు. ఆ తర్వాత, సమంత హోస్ట్‌గా వ్యవహరించిన ఓ షోలోనూ కంటి చికిత్స గురించి, కిడ్నీ పాడైందని చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: పెద్దలు అడ్డుచెప్పారని.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య!
-
India News
Wayanad bypoll: వయనాడ్ ఉప ఎన్నిక.. సీఈసీ ఏం చెప్పారంటే..?
-
Politics News
Komatireddy: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ జరిపించాలి: కోమటిరెడ్డి
-
Movies News
Samantha: చేయని నేరానికి నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి.. విడాకులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
-
Sports News
Sachin - Razzak: వీరే డేంజరస్ బ్యాటర్లు.. సచిన్‌కు రెండో ర్యాంక్.. అతడిదే తొలి స్థానం: రజాక్
-
Movies News
Allu Arjun: అందుకే అల్లు అర్జున్ను ఐకాన్ స్టార్ అనేది.. బన్నీపై ప్రశంసలు కురిపించిన టాప్ డైరెక్టర్