Animal: రణ్‌బీర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌.. ‘యానిమల్’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే!

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన ‘యానిమల్‌’ (Animal) తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. మంచి కలెక్షన్లతో రణ్ బీర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.

Updated : 02 Dec 2023 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈచిత్రం మంచి టాక్‌ను అందుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. రణ్‌బీర్ (Ranbir Kapoor) కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యానిమల్’ తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే హవా చూపిన ఈ చిత్రం మొదటి రోజు వందకోట్ల మార్క్‌ను సులువుగా చేరుకుంది. ఫస్ట్‌డే ప్రపంచ వ్యాప్తంగా రూ.116కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. భారత్‌లో రూ.55 కోట్లు రాబట్టి ఈ ఏడాది విడుదలైన ‘జవాన్‌’, ‘పఠాన్‌’ల తర్వాత స్థానంలో నిలిచింది. అలాగే బాలీవుడ్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డు క్రియేట్‌ చేసింది. ఇక ఈ వీకెండ్‌కు కలెక్షన్ల జోరు పెరిగేలా కనిపిస్తోంది. రూ.200కోట్లతో రూపొందిన ఈ మూవీ ఆ మార్క్‌ను సులువుగా అందుకుంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. సందీప్ వంగా గత సినిమా ‘కబీర్‌ సింగ్‌’ రికార్డులను బద్దలు కొడుతుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

సిల్క్‌ స్మిత బయోపిక్‌.. హీరోయిన్‌గా ఎవరంటే..?

ఇక తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో పాటు రష్మిక, అనిల్ కపూర్‌, బాబీ దేవోల్‌ల నటన, యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌తోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం విడుదలయ్యాక యాక్షన్‌ ప్రియుల మనసులను దోచుకుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని