Ranbir Kapoor: నా గడ్డం కారణంగానే ఆ సినిమా హిట్ అవ్వలేదు...
ఇటీవల జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణబీర్ కపూర్(Ranbir Kapoor) పాల్గొన్నారు. అందులో మాట్లాడుతూ తన షంషేరా సినిమా పరాజయానికి గల కారణాన్ని చెప్పారు.
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) నాలుగు సంవత్సరాల విరామం తర్వాత షంషేరా(Shamshera), బ్రహ్మస్త్ర(Brahmastra) సినిమాల్లో నటించారు. అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వం వహించిన బ్రహ్మస్త్ర సినిమా మంచి గుర్తింపుతో ప్రేక్షకాదరణ పొందింది. అయితే కరణ్ మల్హోత్రా తెరకెక్కించిన షంషేరా చిత్రం బాక్సాఫీసు వద్ద వైఫల్యాన్ని చవిచూసింది. తాజాగా రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022(Red Sea International Film Festival)లో ఆ సినిమా ఎందుకు అలరించలేకపోయిందో రణబీర్ చెప్పాడు.
తాను చేసిన అతి కష్టమైన సినిమాల్లో షంషేరా ఒకటని వెల్లడించిన రణబీర్ ‘ఈ సినిమా పరాజయం పొందడం వెనక మేము చేసిన పొరపాట్లు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి నా గడ్డం. నేను ఈ సినిమా కోసం కృత్రిమ గడ్డాన్ని పెట్టుకున్నాను. ఎండలో షూటింగ్ చేసేటప్పుడు అది సహజంగా కనిపించలేదు. ముఖానికి అతుక్కున్నట్లు కనిపించేది. అందుకే ఈ సినిమా హిట్ అవ్వలేదని అనుకుంటా’ అన్నారు. రణబీర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో సంజయ్ దత్, వాణి కపూర్, రోనిత్ రాయ్, సౌరభ్ శుక్లా నటించారు. అలాగే తన కెరీర్‌లో 2017లో విడుదలైన జగ్గా జూసూస్ సినిమా హిట్ అవ్వకపోవడం తననెంతో బాధించిందని రణబీర్ తెలిపాడు. కొవిడ్ కారణంగా చిత్రపరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని, బలమైన కథనాలతో నూతనోత్తేజంతో భారతీయ సినిమా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
మాజీ మంత్రి ముత్తంశెట్టికి చుక్కెదురు.. రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన
-
Politics News
Perni Nani: ‘జగన్ పిచ్చి మారాజు’
-
Politics News
Kumaraswamy: దేవేగౌడ తర్వాత నాకు కేసీఆరే స్ఫూర్తి: కుమారస్వామి
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ