Ranbir Kapoor: రాముడి పాత్ర కోసం అలవాట్లు మార్చుకున్న రణ్‌బీర్‌!

అల్లు అరవింద్‌ (Allu Aravind) నిర్మాతగా నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రామాయణం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులోని పాత్ర కోసం రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) అలవాట్లు మార్చుకోనున్నట్లు తెలుస్తోంది.

Published : 10 Oct 2023 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ దర్శకుడు నితేశ్‌ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రామాయాణాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని తారాగణంపై ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో రాముడి పాత్ర హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కొన్ని అలవాట్లను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌ నటించడం దాదాపుగా ఖాయమైనట్లే. ఈ హీరో అయితేనే రాముడి పాత్రకు సరైన న్యాయం చేయగలడని ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ అగ్ర నటులు కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఈ పాత్ర కోసం రణ్‌బీర్‌ కొన్ని అలవాట్లను మార్చుకున్నాట్లు టాక్‌ వినిపిస్తుంది. షూటింగ్‌ మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు ఆయన మాంసాహారం, మద్యపానం మానేయాలని నిర్ణయించుకున్నాడట. అలాగే ఈ సినిమాకు పనిచేయనున్న చిత్రబృందమంతా కూడా ఇలాంటి కొన్ని నియమాలు పాటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బాలీవుడ్‌ మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. 

ఆ పాన్‌ మసాలా ప్రకటన ఇప్పటిది కాదు.. రూమర్స్‌పై స్పందించిన అక్షయ్‌ కుమార్‌..

ఇక ఈ సినిమాలో సీత పాత్ర కోసం సాయి పల్లవిని (Sai Pallavi) నితేశ్‌ తివారీ టీమ్‌ సంప్రదించిందని ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే ఆమెకు లుక్‌ టెస్ట్‌ కూడా నిర్వహించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని మధు మంతెన (Madhu Mantena)తో కలిసి అల్లు అరవింద్ నిర్మించనున్నారు. గతంలో దీని గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. దీని కోసం నాలుగేళ్లుగా వర్క్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద, అతి భారీ బడ్జెట్‌ సినిమాగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని