Animal: ‘యానిమల్‌’ కోసం రణ్‌బీర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే!

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. ఇందులో రణ్‌బీర్‌ లుక్‌పై ట్రైనర్‌ పోస్ట్ పెట్టారు.

Updated : 29 Nov 2023 17:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన తాజా చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ సినిమాలో తన లుక్‌ కోసం రణ్‌బీర్ కపూర్‌ పడిన కష్టాన్ని తన ట్రైనర్‌ వెల్లడించారు. ఎంతోమంది సెలబ్రిటీల వ్యక్తిగత జిమ్‌ ట్రైనర్‌ శివోహం.. రణ్‌బీర్‌ ఎంతో కఠోర శ్రమ చేసినట్లు రాసుకొచ్చారు. ‘మరోలక్ష్యం నెరవేరింది. మరో మైలురాయిని సాధించారు. పనిపట్ల మీ కృషి, అంకితభావం మాటల్లో చెప్పలేనివి. అలాగే మీ నటనతో ఎప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. మీ ఫిట్‌నెస్‌ కోచ్‌గా ఉండడం నాకెంతో ఆనందానిస్తుంది’ అంటూ ‘యానిమల్‌’ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఇక రణ్‌బీర్ గత చిత్రాన్ని తాజా లుక్‌తో పోలుస్తూ ఒక ఫొటోను షేర్‌ చేశారు. ఇది చూసినవారంతా వావ్‌ అంటున్నారు.

సినిమా వాయిదా.. గౌతమ్‌ మేనన్ ఎమోషనల్‌ పోస్ట్

అలాగే యానిమల్ కోసం నటుడు బాబీ దేవోల్‌ (Bobby Deol) కూడా ఎంతో కష్టపడి రణ్‌బీర్‌కు మించి కనిపించారు. ఈ లుక్ కోసం బాబీ దేవోల్‌ నాలుగు నెలల పాటు స్వీట్స్‌ తినకుండా కచ్చితమైన డైట్‌ ఫాలో అయినట్లు తెలిపారు. ఇందంతా చూస్తే ‘యానిమల్‌’ కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది. ఇక ‘కబీర్‌ సింగ్‌’ తర్వాత బాలీవుడ్‌లో సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిదే. డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది. తండ్రీతనయుల సెంటిమెంట్‌తో అలరించడానికి సిద్ధమైంది. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడు..? అనే అంశాన్ని ఈసినిమాలో చూపించనున్నారు. రష్మిక కథానాయికగా నటించగా.. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, శక్తికపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పోస్టర్లతోనే అంచనాలను కలిగించిన చిత్రబృందం ట్రైలర్‌తో వాటిని రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ఇందులో రణ్‌బీర్‌ పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు