Rashmika - Vijay Deverakonda: రష్మిక - విజయ్ దేవరకొండ.. లైవ్‌లో సీక్రెట్ చెప్పిన రణ్‌బీర్‌.. నటి షాక్

‘అన్‌స్టాపబుల్‌’ షోలో తాజాగా ‘యానిమల్‌’ (Animal) టీమ్‌ సందడి చేసింది.తమ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకుంది. 

Updated : 28 Nov 2023 13:29 IST

త్రివిక్రమ్‌ విషయంలో నాకు నచ్చనిది అదే : సందీప్‌రెడ్డి వంగా

ఇంటర్నెట్‌డెస్క్: బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ ’ (Unstoppable). ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ షోలో తాజాగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, రష్మిక, రణ్‌బీర్‌ కపూర్ సందడి చేశారు. ‘యానిమల్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా వీళ్లు ఈ షోలో పాల్గొన్నారు. తమ సినిమా విశేషాలను పంచుకున్నారు.

తండ్రీ-కొడుకుల సెంటిమెంట్‌తో ‘యానిమల్‌’ని తీర్చిదిద్దామని.. ఒక వ్యక్తి తన ఫ్యామిలీ కోసం ఎంత దూరం వెళ్తాడు? అనేది దీనిలో చూపించామని సందీప్‌ తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నుంచి ‘స్పిరిట్‌’ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. అనంతరం, పలువురు తెలుగు దర్శకుల్లో తనకు నచ్చే, నచ్చని విషయాలపై సందీప్‌ సరదాగా మాట్లాడారు. త్రివిక్రమ్‌ అద్భుతమైన రచయిత అని, తెలుగు భాషపై మంచి పట్టు ఉందన్నారు. ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌ని తీసుకుంటారని అది తనకు నచ్చదని సరదాగా చెప్పారు. బోయపాటి.. ప్రతి యాక్షన్‌ ఎపిసోడ్‌ దేవాలయాల్లోనే షూట్‌ చేస్తున్నారని.. అది ఇప్పుడు తనకు అంత నచ్చడం లేదన్నారు.

రివ్యూ: ఆదికేశవ.. వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం ఎలా ఉంది?

ఇదిలా ఉండగా.. ఓ టాస్క్‌లో భాగంగా ‘యానిమల్‌’ (Animal) టీమ్.. నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)కు కాల్‌ చేసింది. విజయ్ మాట్లాడుతుండగా.. ‘‘స్పీకర్‌ ఆన్‌లో ఉంది’’ అంటూ రష్మిక నవ్వులు పూయించింది. వెంటనే రణ్‌బీర్‌ ఫోన్‌ తీసుకుని.. ‘‘విజయ్‌.. మేము బాలకృష్ణ షోలో ఉన్నాం. స్క్రీన్‌పై ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్’ పోస్టర్లు చూపించి.. ఏ సినిమా అంటే ఇష్టమో రష్మికను చెప్పమన్నారు. ఆమె ఏం చెబుతుందో చూద్దాం’’ అని టాస్క్‌ను వివరించాడు. ‘‘అర్జున్‌రెడ్డి’తో నాకొక ప్రత్యేక అనుబంధం ఉంది. హైదరాబాద్‌ వచ్చిన సమయంలో నేను చూసిన తొలిచిత్రం అదే. ‘యానిమల్‌’ నేను వర్క్‌ చేసిన మూవీ. కాబట్టి రెండూ నాకు ఇష్టమైన చిత్రాలే’’ అని ఆమె బదులిచ్చింది. మధ్యలో రణ్‌బీర్‌ మాట్లాడుతూ.. ‘‘సర్‌ మీకొక విషయం చెప్పాలి. విజయ్ వాళ్ల ఇంటి మేడ మీద జరిగిన ‘అర్జున్‌రెడ్డి’ సక్సెస్‌ పార్టీలో తొలిసారి సందీప్‌రెడ్డి.. రష్మికను కలిశారు’’ అని చెప్పాడు. ఆయన మాటలతో రష్మిక ఒక్కసారిగా షాకైంది. ‘‘ఈ విషయాలు ఇక్కడ అవసరం లేదు కదా’’ అని నవ్వుతూ చెప్పింది. ‘‘ఆ పార్టీకి ఎవరు ఆహ్వానించారు?’’ అని బాలయ్య సరదాగా ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని