Vijay: 10 రోజులు.. 5 కోట్లు.. యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోన్న విజయ్‌ మేనియా

‘బీస్ట్‌’ తర్వాత విజయ్‌ నటిస్తోన్న చిత్రం ‘వారిసు’. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Published : 16 Nov 2022 11:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ (Vijay) మేనియా ఇప్పుడు యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది. ఆయన హీరోగా నటించిన ‘వారిసు’ (Varisu)లోని ఫస్ట్‌ సింగిల్‌ నెట్టింట విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ‘రంజితమే’ అంటూ సాగే ఈ మాస్‌ సాంగ్‌ను విడుదల చేసి పది రోజులవుతోన్నా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు సరికదా.. మరింత పెరుగుతోంది. ఈ విషయాన్నే తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ ఓ సరికొత్త పోస్టర్‌ షేర్‌ చేసింది. ఇప్పటివరకూ ఈ పాట 5 కోట్ల వ్యూస్‌, 18 లక్షల లైక్స్‌ సొంతం చేసుకుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఫ్యామిలీ, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘వారిసు’. వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరిట విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని  సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. దిల్‌రాజు నిర్మాత. రష్మిక కథానాయిక. జయసుధ, ఖుష్భూ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.



Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు