Prasanth Varma: రణ్‌వీర్‌ - ప్రశాంత్ వర్మల ప్రాజెక్ట్‌ వాయిదా.. అధికారిక వెల్లడి

ప్రశాంత్ వర్మ - రణ్‌వీర్‌ సింగ్‌ల కాంబోలో రానున్న ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పట్లో ఇది లేదని స్పష్టమైంది. 

Published : 30 May 2024 14:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా తెరకెక్కనున్న ‘రాక్షస’ (Rakshasa) ఆగిపోయిందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌పై రానున్న ఈ చిత్రంపై తాజాగా టీమ్‌ అధికారిక నోట్‌ విడుదల చేసింది. ప్రస్తుతానికి వాయిదా పడిందని.. భవిష్యత్తులో వీళ్లిద్దరూ కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది.

దీని గురించి ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ.. ‘రణ్‌వీర్‌ లాంటి ఎనర్జిటిక్‌ హీరో దొరకడం చాలా కష్టం. ఎంతో టాలెంటెడ్‌. భవిష్యత్తులో ఆయనతో కలిసి వర్క్‌ చేస్తాను’ అన్నారు. రణ్‌వీర్‌ (Ranveer Singh) స్పందిస్తూ.. ‘ప్రశాంత్ ఆలోచనలు మరోస్థాయిలో ఉంటాయి. మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్‌ చేయాలని చర్చించాం. ఫ్యూచర్‌లో తప్పకుండా చేస్తాం’ అన్నారు. మైథలాజికల్‌ టచ్‌ ఉన్న పీరియాడికల్‌ డ్రామాగా రూ.200కోట్లతో పాన్‌ ఇండియా స్థాయిలో దీన్ని తెరకెక్కించాలని మేకర్స్‌ భావించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎందుకు వాయిదా పడిందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ఆగిపోయిందనే రూమర్స్‌ను టీమ్‌ ఇటీవలే ఖండించడం గమనార్హం.

చెప్పులు వేసుకోవడం మానేశాను.. కారణమిదే: విజయ్‌ ఆంటోని

ఇక ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ‘జై హనుమాన్‌’తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఘన విజయం సాధించిన ‘హను-మాన్‌’ (Hanuman)కు సీక్వెల్‌గా ఇది రానుంది. ‘హను-మాన్‌’ కంటే వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్‌’ ఉండనుంది. దీని కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళి’ అని రెండు ప్రాజెక్ట్‌లతో పలకరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని