Vijay Antony: చెప్పులు వేసుకోవడం మానేశాను.. కారణమిదే: విజయ్‌ ఆంటోని

తాను చెప్పులు లేకుండా నడవడానికి కారణాన్ని విజయ్ ఆంటోని వివరించారు. భవిష్యత్తులోనూ చెప్పులు వేసుకోనన్నారు. 

Updated : 30 May 2024 15:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ (Vijay Antony). బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి  ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ‘తుఫాను’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చెప్పులు వేసుకోకపోవడానికి గల కారణాన్ని వివరించారు. 

అందుకే ‘కల్కి’ బడ్జెట్‌ ఎక్కువ: ప్రభాస్‌

‘నేను మూడు నెలల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. ఏదో దీక్ష చేస్తున్నానని అందరూ అనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. ఒకరోజు చెప్పులు లేకుండా నడిచాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిది. మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుంది. చెప్పులు లేకుండా తిరుగుతున్నప్పటి నుంచి ఒత్తిడికి గురికాలేదు. అందుకే జీవితమంతా చెప్పులు వేసుకోకూడదని అనుకున్నా’ అని విజయ్‌ ఆంటోని (Vijay Antony) చెప్పారు. ఇక ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్‌ కూడా చెప్పులు వేసుకోరనే విషయం తెలిసిందే. తనకు చెప్పులు వేసుకొని నడవడం ఇష్టం ఉండదని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు.

‘బిచ్చగాడు-3’ రిలీజ్‌ ఎప్పుడంటే..

విజయ్‌ ఆంటోని హీరోగా శశి తెరకెక్కించిన చిత్రం ‘పిచ్చైకారన్‌’ (Pichaikkaran). ‘బిచ్చగాడు’ (Bichagadu) పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇక్కడా ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) దానికి మించిన సక్సెస్‌ అందుకుంది. దీంతో పార్ట్‌3 కోసం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో విజయ్‌ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ‘బిచ్చగాడు 3’ కచ్చితంగా ఉంటుందన్నారు. 2026 వేసవిలో విడుదల చేయాలని (Bichagadu 3) భావిస్తున్నట్లు చెప్పారు. దీంతో సినీ ప్రియులు ఆనందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని