‘ధురంధర్‌’.. గ్యాంగ్‌స్టర్‌

సంగ్రామ్‌ భలేరావ్‌గా ‘సింగమ్‌ అగైన్‌’తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రానున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. రణ్‌వీర్‌ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

Published : 18 May 2024 00:28 IST

సంగ్రామ్‌ భలేరావ్‌గా ‘సింగమ్‌ అగైన్‌’తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రానున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. రణ్‌వీర్‌ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ షూటింగ్‌ పూర్తయ్యాక అదిత్య ధర్‌తో ఓ సినిమాని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దానికి ‘ధురంధర్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు తెలిసింది. ‘ఈ కలయికలో రానున్న తొలి చిత్రం కాబట్టి చిత్రబృందం ఈ సినిమాని ఎంతో ప్రత్యేకంగా తెరకెక్కించనుంది. ఈ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ని రాజకీయాలు, గ్యాంగ్‌వార్‌ నేపథ్యంలో రూపొందించనున్నారు. జూన్‌లో దీని చిత్రీకరణను మొదలుపెట్టనున్నారు’ అని సన్నిహితవర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని