Rashmika: రష్మిక భర్త విజయ్‌లా ఉండాలి.. నిజమేనన్న రష్మిక

రష్మిక భర్త విజయ్‌లా ఉండాలి అన్న అభిమాని ట్వీట్‌కు అది నిజమేనంటూ ఆమె రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఆ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Published : 27 Feb 2024 20:30 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika) ఈ జంటకి తెలుగు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.  వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. వాటిపై క్లారిటీ లేదు, కానీ గతంలో సోషల్‌ మీడియాలో రష్మిక పెట్టిన ఫొటోలు చూసి ఆ వార్తలు నిజమేనంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఓ అభిమాని ట్వీట్‌కు రష్మిక రిప్లై ఇవ్వడంతో మరోసారి ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రష్మిక తన ఎక్స్‌ ఖాతాలో అభిమానులు చేసిన ట్వీట్‌కి సరదాగా బదులిచ్చారు.  ఓ అభిమాని.. రష్మికకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే..  ‘రష్మిక నేషనల్ క్రష్ కాబట్టి ఆమె భర్త చాలా స్పెషల్ గా ఉండాలి. ఆమె హస్బెండ్ ‘వీడీ’లా ఉండాలి.  వీడీ అంటే వెరీ డేరింగ్‌.  ఆమెను ప్రొటెక్ట్ చేయాలి.  క్వీన్‌ రష్మికకు రాజులాంటి భర్త రావాలి అని పోస్ట్‌ పెట్టాడు. దీనిపై స్పందించిన రష్మిక ఇది నిజమేనంటూ రిప్లై ఇచ్చారు.  దీంతో వీడీ అంటే విజయ్‌ దేవరకొండ అని అర్థం చేసుకుంటున్నారు.

‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాల్లో విజయ్‌-రష్మిక కలిసి నటించారు. వీరు ప్రేమలో ఉన్నారు, తర్వలో నిశ్చితార్థం జరగనుందంటూ కథనాలు గతంలో చక్కర్లు కొట్టాయి. వీటిపై స్పందించిన ఈ స్టార్స్‌ ఇద్దరూ మేము కేవలం మంచి స్నేహితులమేనంటూ క్లారిటీ ఇచ్చారు. అయినా కథనాలు మాత్రం ఆగడం లేదు. వీటికి ఫుల్‌స్టాప్‌ ఎప్పుడు పడుతుందో చూడాలి.

ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప: ది రూల్‌’లో నటిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ పరశురామ్‌ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఏప్రిల్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని