The Girlfriend: ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రానికి మలయాళంలో డబ్బింగ్‌ చెప్పిన రష్మిక

రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రానికి మలయాళంలో డబ్బింగ్‌ చెప్పారు.

Published : 31 Mar 2024 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika Mandanna) ‘యానిమల్‌’ చిత్రంలో నటించి బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం  వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్‌మీడియా వేదికగా ఓ అభిమాని ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ చెప్పమని కోరారు. దీనిపై స్పందించిన దర్శకుడు రిప్లై ఇచ్చారు. ‘‘ఈ సినిమా టీజర్‌ ఆమె పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నాం. టీజర్‌ కోసం ఐదు భాషల్లో రష్మిక డబ్బింగ్‌ చెప్పారు. ఆమె మలయాళంలో డబ్బింగ్‌ చెప్పడం ఇదే మొదటిసారి’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. దీనిపై స్పందించిన అభిమానులు ‘రష్మిక డెడికేషన్‌ అంటే ఇది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. 

రష్మిక అల్లు అర్జున్‌ ‘పుష్ప: ది రూల్‌’లో నటిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని సుకుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, ధనంజయ, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని