Pushpa2: ‘పుష్ప2’ షూటింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన రష్మిక..ఫొటో వైరల్‌

‘పుష్ప2’ షూటింగ్‌ ప్రస్తుతం యాగంటిలో జరుగుతున్నట్లు రష్మిక తెలిపారు.

Published : 20 Mar 2024 19:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు ప్రేక్షకులతో పాటు సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule). అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన చిన్న వార్త కూడా క్షణాల్లో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోన్న ఈ మూవీపై రష్మిక (Rashmika) ఓ అప్‌డేట్‌ షేర్‌ చేశారు. దీని షూటింగ్ నంద్యాలలోని యాగంటి ఆలయంలో జరుగుతున్నట్లు తెలిపారు. అక్కడ తీసిన ఫొటో పంచుకున్న ఆమె.. ‘ఈ గుడిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఆలయ స్థలపురాణం అద్భుతంగా ఉంది. ఇక్కడి ప్రజల ప్రేమను మాటల్లో చెప్పలేను. ఈరోజు షూటింగ్ చాలా బాగా జరిగింది’ అని రాసుకొచ్చారు.

మరోవైపు ‘పుష్ప2’ సెట్‌లో రష్మిక లుక్‌ అంటూ ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ షేర్‌ అవుతోంది. అందులో ఈ నేషనల్ క్రష్‌ రెడ్‌ కలర్‌ శారీలో క్యూట్‌గా కనిపిస్తున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో తన పాత్ర గురించి రష్మిక మాట్లాడుతూ.. మొదటి భాగంలో కంటే రెండులో తన పాత్రకు మరిన్ని బాధ్యతలుంటాయన్నారు. ఈ సీక్వెల్‌ అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండనుందని.. సుకుమార్‌ ప్రతీ సన్నివేశాన్ని పర్‌ఫెక్ట్‌గా తీస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.

2021 డిసెంబరులో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ‘పుష్ప’కు సీక్వెల్‌గా ‘పుష్ప 2’కు తెరకెక్కుతోంది. ‘పుష్ప’ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టడం, అందులోని నటనకుగాను అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడం, దేవిశ్రీ ప్రసాద్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కడంతో ‘పుష్ప 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని