Rashmika: అవధులు లేని మీ అభిమానానికి కృతజ్ఞతలు.. స్పెషల్ ఫొటో షేర్‌ చేసిన రష్మిక

నటి రష్మిక (Rashmika) యానిమల్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated : 28 Nov 2023 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తన అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూ రష్మిక (Rashmika Mandanna) పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తారల్లో రష్మిక ఒకరు. తన సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ అభిమానుల్లో జోష్ నింపుతుంటారు. తాజాగా జరిగిన ‘యానిమల్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె షేర్‌ చేశారు. ప్రస్తుతం అవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

‘ఈ ఫొటోలు నాకెంతో నచ్చాయి. వీటిని ఇంత అందంగా తీసిన వారికి కృతజ్ఞతలు. నిన్న ఈవెంట్లో మీ అందరి ప్రేమ, గౌరవం, నాపై ఉన్న అభిమానం.. ఇవన్ని కలిసి అద్భుతమైన క్షణాలను అందించాయి. హద్దులు లేని మీ అభిమానానికి ఎప్పుడూ నేను ఆశ్చర్యపోతుంటాను. మూడు రోజుల్లో ‘యానిమల్‌’తో మీ అందరినీ పలకరించడానికి రానున్నా’ అంటూ అభిమానులకు రష్మిక కృతజ్ఞతలు చెప్పారు. ఇక తాజాగా జరిగిన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, మహేశ్‌బాబు (Mahesh Babu) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రష్మికను ఉద్దేశిస్తూ మహేశ్‌ బాబు మాట్లాడుతూ ఆమె అన్ని భాషల్లో నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసించారు. ఆప్యాయంగా హత్తుకుని అభినందించారు.

బాబీ దేవోల్‌ చెప్పిన డైలాగ్‌ ఆ సినిమాలోదేనా! నెట్టింట ఆసక్తికర చర్చ..

ఇక రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ సరసన  ‘యానిమల్‌’ (Animal)లో నటించారు. ఈ చిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌కు జోడీగా ‘పుష్ప2’లో శ్రీ వల్లిగా అలరించనున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఇక వీటితో పాటు ‘రెయిన్‌ బో’ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని