Bobby Deol: బాబీ దేవోల్‌ చెప్పిన డైలాగ్‌ ఆ సినిమాలోదేనా! నెట్టింట ఆసక్తికర చర్చ..

బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్ (Bobby Deol) చెప్పిన డైలాగ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది ఏ సినిమాలోదనే చర్చ మొదలైంది.

Published : 28 Nov 2023 14:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ నటులు టాలీవుడ్‌ సినిమాల్లోనూ విలన్ పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్‌, సంజయ్‌ దత్‌లు ప్రతినాయకుడి పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ (Bobby Deol)కూడా టాలీవుడ్‌లో బిజీగా మారారు. తాజాగా ఆయన చెప్పిన తెలుగు డైలాగ్ ఒకటి నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీసింది.

ప్రస్తుతం బాబీ దేవోల్ తెలుగులో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)లో నటిస్తున్నారు. అలాగే సూర్య నటిస్తున్న భారీ ప్రాజెక్ట్‌ ‘కంగువా’లోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీటితో పాటు బాలకృష్ణ సినిమాలోనూ నటించనున్నారనే టాక్ ఉంది. తాజాగా ‘యానిమల్‌’ (Animal) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాబీ దేవోల్ మాట్లాడుతూ..‘నేను తెలుగులో ఓ సినిమా చేస్తున్నాను. అందులో డైలాగ్ నాకు గుర్తుంది. ‘బాద్‌షా బేగం మా ప్రాణం. మా ప్రాణాన్ని కాపాడడం కోసం మీకేం కావాలో కోరుకోమని ఆదేశిస్తున్నా’’ అనే డైలాగ్ చెప్పారు. ఈ డైలాగ్ ‘హరిహర వీరమల్లు’లోదే అని కొందరు ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో చాలా రోజుల తర్వాత ఈ సినిమా పేరు సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది.

మహేశ్‌బాబు ‘బిజినెస్‌మేన్‌’ చూసి ఎంపీ అయ్యా.. మల్లారెడ్డి స్పీచ్‌కు మహేశ్‌బాబు నవ్వులే నవ్వులు!

ఇక రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’. ఇందులో బాబీ దేవోల్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఆయన నాలుగు నెలలు పాటు స్వీట్స్ కూడా తినకుండా కఠోర సాధన చేశారు. ఇక తండ్రీ తనయుల సెంటిమెంట్‌తో ‘యానిమల్‌’ సిద్ధమైంది. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడు..? అనే అంశాన్ని ఈ సినిమాలో చూపించారు. అనిల్‌ కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌ తండ్రీ కొడుకులుగా నటించారు. రష్మిక కథానాయిక. డిసెంబర్‌ 1న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు