Raveena Tandon: ఇది చిత్ర పరిశ్రమ కాదు.. రాజకీయాలు, కార్పొరేట్‌ వ్యవస్థ కలిసిన ప్రపంచం: రవీనా

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ గురించి నటి రవీనా టాండన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 26 Mar 2024 18:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ ‘కేజీయఫ్‌-2’లో రమికా సేన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. జనవరిలో విడుదలైన ‘కర్మ కాలింగ్‌’ అనే వెబ్‌సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇలీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీనా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ఒకప్పుడు సెట్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ సరదాగా ఉండేవారు. ఇప్పుడు అలా లేదు. అందరూ రాజకీయాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో పోటీ సహజంగానే ఉంటుంది. కానీ, హిందీ పరిశ్రమలో కొందరు అభద్రతాభావంతో ఉంటే, మరికొందరు ఎదుటివారి ఎదుగుదలని చూడలేకుండా ఉన్నారు. ఇది పరిశ్రమ కాదు. రాజకీయాలు, కార్పొరేట్‌ వ్యవస్థ కలిసిన ప్రపంచం. ఇక్కడ గ్రూపిజమ్‌, నెపోటిజం ఎక్కువ. సపోర్ట్‌ లేకుండా వచ్చేవారికి తొందరగా అవకాశాలు రావు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని రాణిస్తున్నారు అంటే వారిని ఎలా అయినా ఓడించాలనుకునే వారూ ఉన్నారు. అందువల్ల నేను కూడా కెరీర్‌ ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా. బయట ప్రపంచంలో ఉన్న వారు పరిశ్రమలో ఉన్నవారి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. తెరవెనక జరిగే వాటి గురించి మాట్లాడితే మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ నేను ఎవరినీ బాధించలేదు. ఎవరికీ సినిమా అవకాశాలు దూరం చేయలేదు. తెలియక పొరపాటు చేసుంటే క్షమించండి’’ అని రవీనా టాండన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని