RT75: మరోసారి అలరించేందుకు సిద్ధమైన ‘ధమాకా’ జోడి..

రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ప్రారంభమైంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Published : 11 Jun 2024 16:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ధమాకా’తో సందడి చేసిన రవితేజ-శ్రీలీల జోడి ఇప్పుడు మరోసారి రిపీట్‌ కానుంది. రవితేజ (Ravi Teja) హీరోగా కొత్త దర్శకుడు భాను భోగవరపు ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘RT75’తో అది ప్రచారంలో ఉంది. ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో మొదలైంది. శ్రీలీల (Sreeleela) క్లాప్‌ కొట్టి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి.

రవితేజ నటిస్తున్న 75వ సినిమా కావడంతో ఈ సినిమా ఆయనకు ప్రత్యేకం కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాను ప్రకటించినప్పుడే దీని గురించి రవితేజ పోస్ట్‌ పెడుతూ ‘ధూమ్‌ ధామ్‌ దావత్‌’ గ్యారంటీ అని పేర్కొన్నారు. దీంతో ఇందులో ఆయన మరోసారి మాస్‌ మహారాజ్‌లా కనిపిస్తారా అని అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న భాను భోగవరపు గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’కు మాటల రచయితగా పని చేశారు. ఈ మూవీకి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. దీనితో పాటు రవితేజ.. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా (RT4GM) చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబోలో రానున్న నాలుగో చిత్రమిది. 

సోనాక్షి పెళ్లి రూమర్స్‌.. స్పందించిన శతృఘ్న సిన్హా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని