Rishab Shetty: నేను చెప్పింది ఇప్పటికి అర్థం చేసుకున్నారు.. తన స్పీచ్‌పై రిషబ్‌ శెట్టి పోస్ట్‌

రిషబ్‌ శెట్టి (Rishab Shetty) తాజా స్పీచ్‌ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై ఓ అభిమాని పెట్టిన పోస్ట్‌కు రిషబ్‌ స్పందించారు.

Published : 01 Dec 2023 15:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కాంతార’తో అందరినీ ఆశ్చర్యపరిచారు రిషబ్‌ శెట్టి (Rishab Shetty). తాజాగా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) వేడుకలో ఆయన స్పీచ్‌ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆయన పరోక్షంగా రష్మిక గురించి మాట్లాడారంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఈ అంశంపై వివరణ ఇస్తూ ఓ అభిమాని పోస్ట్ పెట్టగా.. దానికి రిషబ్‌ స్పందించారు.

తాజాగా గోవాలో జరిగిన ‘ఇఫి’ వేడుకల్లో ‘కాంతార’కు సిల్వర్‌ పీకాక్‌ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రిషబ్‌ మాట్లాడుతూ.. ‘‘కాంతార’ (Kantara) సినిమా పెద్ద హిట్‌ కావడానికి కారణమైన కన్నడ ప్రేక్షకులకు ధన్యవాదాలు. వాళ్లు ఆదరించడంతోనే ఇది విజయం సాధించింది. ఆ తర్వాతే ఈ చిత్రం ఇతర భాషల్లోనూ హిట్‌ అయింది. ఒక ప్రాజెక్ట్ సూపర్‌ సక్సెస్‌ అయ్యాక కన్నడ ఇండస్ట్రీని వదిలి వేరే భాషల్లోకి నేను వెళ్లను. నేను అలాంటి వ్యక్తిని కాదు’ అని పేర్కొన్నారు. అయితే, కొందరు నెటిజన్లు ఆయన రష్మికను ఉద్దేశించి మాట్లాడారంటూ పోస్ట్‌లు పెట్టారు. రష్మిక (Rashmika) తన తొలి చిత్రం తర్వాత కన్నడ ఫిల్మ్‌ ఇండస్ట్రీపై ఆసక్తి చూపలేదని.. అదే విషయాన్ని రిషబ్‌ పరోక్షంగా వెల్లడించారని కొందరు అన్నారు.

యానిమల్‌.. రణ్‌బీర్‌-సందీప్‌ వంగా యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

తాజాగా ఓ అభిమాని ఈ విషయంపై వివరణ ఇస్తూ.. రిషబ్‌ చెప్పింది ఎవరినీ ఉద్దేశించి కాదని.. ఆయన పరిశ్రమను వదిలి వెళ్లనని చెప్పారంటూ ఆ స్పీచ్‌ను పోస్ట్ చేశారు. దీనిపై రిషబ్‌ స్పందిస్తూ.. ‘నేను చెప్పింది ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇక ప్రస్తుతం ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ‘కాంతార’ చాప్టర్‌ 1 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇందులో రిషబ్‌ లుక్‌కు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేయగా దానికి మంచి ప్రేక్షకాదరణ వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు