Sathya: హాలీవుడ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేదికపై సాయి ధరమ్‌ తేజ్‌ షార్ట్‌ ఫిల్మ్

సాయి ధరమ్ తేజ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ‘సత్య’ను (Satya) హాలీవుడ్‌లో జరగనున్న ఓ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు.

Updated : 02 Dec 2023 12:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  సాయి ధరమ్ తేజ్‌ (Sai Dharam tej), కలర్స్‌ స్వాతి ప్రధానపాత్రల్లో నటించిన లఘు చిత్రం ‘సత్య’ (Satya). ఇప్పటికే ఈ షార్ట్‌ ఫిల్మ్ పలు అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా దీనికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని తెలుపుతూ సాయి ధరమ్ తేజ్‌ పోస్ట్ పెట్టారు.

‘నాకెంతో ఇష్టమైన షార్ట్‌ ఫిల్మ్‌ ‘సత్య’ను.. డిసెంబర్‌ 9న హాలీవుడ్‌ బీఎల్‌వీడీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఈ వేడుకను మా షార్ట్‌ ఫిల్మ్‌ స్క్రీనింగ్‌తోనే మొదలు పెట్టడం ఎంతో గౌరవంగా ఉంది. ఇది మా టీమ్ అందరికీ గర్వకారణం. కాలిఫోర్నియాకు దగ్గరలో ఉండే వాళ్లు ఆ వేడుకకు హాజరై ‘సత్య’ను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అని పోస్ట్‌ చేశారు. దీంతో అభిమానులు టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఇటీవలే ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఒనిరోస్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేదికపై ప్రదర్శించగా.. ఇది రెండు అవార్డులను పొందింది. సైనికులకు నివాళులర్పిస్తూ ఇందులో ‘సోల్ ఆఫ్ సత్య’అనే పాటను రూపొందించారు. దాన్ని ఆగస్టు 15న విడుదల చేయగా మంచి వ్యూస్‌తో ప్రశంసలు పొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని