Sai Pallavi: కాలేజీ ఫెస్ట్‌లో సాయి పల్లవి డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

సాయి పల్లవి డ్యాన్స్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 17 Apr 2024 00:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ రియాలిటీ డ్యాన్స్‌ షో ‘ఢీ’లో డ్యాన్సర్‌గా మెరిసి, ఆ తర్వాత హీరోయిన్‌గా మారారు సాయి పల్లవి (Sai Pallavi). నటనతో ఎంత ఆకట్టుకుంటారో.. తన డ్యాన్స్‌తోనూ అదే స్థాయిలో అలరిస్తారు. కాలేజీ రోజుల్లో తాను చేసిన నృత్యం ఇప్పుడు నెట్టింట అందరినీ ఆకర్షిస్తోంది. ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియదుగానీ సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌)లో వైరల్‌గా మారింది. సాయి పల్లవి తన కాలేజీలో జరిగిన ఫెస్ట్‌లో బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘షీలా కీ జవానీ’కి ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్‌ చేసి ఉర్రూతలూగించారు. ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో ‘తండేల్‌’లో నటిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. తమిళంలో.. శివ కార్తికేయన్‌ సరసన ‘అమరన్‌’ సినిమాలో కనిపించనున్నారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న రామాయణంలో సీతగా నటించనున్నారని సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని