Saif Ali Khan: రిస్కు చేశారన్నారు.. ‘ఆదిపురుష్‌’ ఫలితంపై స్పందించిన సైఫ్‌ అలీఖాన్‌

ఓడిపోతే అధైర్యపడకూడదని సైఫ్‌ అలీఖాన్ అన్నారు.

Published : 08 Feb 2024 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్ హీరోగా ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్‌’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇందులో లంకేశ్‌ పాత్రలో కనిపించిన బాలీవుడ్‌ హీరో సైఫ్ అలీఖాన్‌ తాజాగా ఈ సినిమా ఫలితంపై స్పందించారు.

‘నేనెప్పుడూ పెద్దహీరోని అని భావించలేదు. ఎప్పటికీ అలా అనుకోను. నా తల్లిదండ్రులు కూడా సినిమా పరిశ్రమకు చెందినవారే అయినప్పటికీ ఎప్పుడూ సాధారణ జీవితాన్నే గడిపారు. జీవితంలో దృష్టిపెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను వాస్తవంలో బతకాలని కోరుకుంటాను. ఓటమి గురించి భయపడను. ఉదాహరణకు ‘ఆదిపురుష్‌’ సినిమానే తీసుకుందాం.. రిస్కు చేశారని అందరూ అన్నారు. ఎంతోమంది విమర్శించారు. కొత్తగా ప్రయత్నించినపుడు హిట్‌ కాకపోయినా అధైర్యపడకూడదు. దురదృష్టం కొద్దీ అది విజయం సాధించలేదనుకోవాలి. తర్వాత సినిమాలో రెట్టింపు ఉత్సాహంతో అలరించాలని పని చేయాలి. నేను అదే చేశాను’ అన్నారు.

అలాంటి వాళ్లను వెనక్కి లాగొద్దు.. విజయ్ పొలిటికల్‌ ఎంట్రీపై ఉపాసన కామెంట్స్‌..

ప్రభాస్ రాముడిగా కనిపించిన ‘ఆదిపురుష్‌’ను ప్రకటించిన నాటినుంచి విడుదలయ్యే వరకు వరుసగా వివాదాలు చుట్టుముట్టాయి. పాత్రల వేషధారణ మొదలు సన్నివేశాల్లో వాడిన భాష, చిత్రీకరించిన ప్రదేశాలపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. భారీ అంచనాల మధ్య గతేడాది జూన్‌ 16న విడుదలైన ఈ చిత్రం వాటిని అందుకోవడంలో విఫలమైంది. అంతేకాదు ఈ సినిమాపై కొందరు కోర్టుకెక్కారు. మనోభావాలను పట్టించుకోకుండా పురాణాలను అపహాస్యం చేశారంటూ వివిధ హైకోర్టుల్లో పలు కేసులు పెట్టారు. అయితే వాటన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని