Sailesh Kolanu: గాయకుడిగా శైలేశ్‌ కొలను.. వీడియో వైరల్‌

‘సైంధవ్‌’ దర్శకుడు శైలేశ్ కొలను (Sailesh Kolanu) గాయకుడి అవతారమెత్తారు.

Updated : 07 Jan 2024 14:00 IST

హైదరాబాద్‌: ‘సైంధవ్‌’ (Saindhav) దర్శకుడు శైలేశ్‌ కొలను (Sailesh Kolanu) గాయకుడి అవతారమెత్తారు. ‘బుజ్జికొండవే’ పాటను ఆలపించారు. ‘‘సినిమా రిలీజ్‌ టెన్షన్‌ తట్టుకునేందుకు నేను చేసే పని ఇదే. ఈ పాటను ఆలపించినప్పుడల్లా నా మనసుకు హాయి లభిస్తుంది. జనవరి 13న థియేటర్స్‌లో కలుద్దాం. ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘మీలో మంచి గాయకుడు ఉన్నారు’’, ‘‘మీరు బాగా పాడుతున్నారు’’ అని కామెంట్లు పెట్టారు.

Hi Nanna: అలా చేసుంటే.. ‘హాయ్‌ నాన్న’ ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ

వెంకటేశ్‌ 75వ చిత్రంగా ‘సైంధవ్‌’ సిద్ధమైంది. తండ్రీ కుమార్తెల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో బేబీ సారా ముఖ్య భూమిక పోషించింది. spinal muscular atrophy నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా దీనిని తీర్చిదిద్దారు. శ్రద్ధా శ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘హిట్‌’ యూనివర్స్‌లో ‘సైంధవ్‌’ భాగమేనంటూ ప్రచారం జరగ్గా.. అది నిజం కాదని దర్శకుడు ఇటీవల స్పష్టతనిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని