Saindhav: ఓటీటీలోకి ‘సైంధ‌వ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

వెంకటేశ్‌ (Venkatesh) తాజా చిత్రం ‘సైంధ‌వ్‌’ (Saindhav) ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. 

Updated : 31 Jan 2024 13:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుడు వెంకటేశ్ ఈ సంక్రాంతికి ‘సైంధ‌వ్‌’ (Saindhav)తో పలకరించారు. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో యాక్షన్‌ కథాంశంతో రూపొందింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 3 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానుంది. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, రుహానీ శర్మ, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సూర్య- జ్యోతిక విహార యాత్ర.. ఫొటోలు వైరల్‌.. ఆ వార్తలకు ఫుల్‌స్టాప్‌!

చంద్ర‌ప్ర‌స్థ అనే క‌ల్పిత న‌గ‌రం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. సైంధ‌వ్ కోనేరు అలియాస్ సైకో (వెంక‌టేశ్‌) త‌న ప్రాణానికి ప్రాణ‌మైన కూతురు గాయ‌త్రి (బేబి సారా)తో క‌లిసి నివసిస్తుంటాడు. భ‌ర్త నుంచి విడిపోయిన మ‌నో (శ్ర‌ద్ధా శ్రీనాథ్‌)తో అనుబంధం ఏర్ప‌డుతుంది. గ‌తంలో కార్టెల్ సంస్థ‌లో ప‌నిచేసిన సైకో.. పెళ్లి త‌ర్వాత భార్య‌కిచ్చిన మాట కోసం అక్క‌డ ప‌ని చేయ‌డం మానేసి కూతురే ప్ర‌పంచంగా బ‌తుకుతుంటాడు. ఇంత‌లో ‘స్పైన‌ల్ మ‌స్కుల‌ర్ అట్రోఫీ’ అనే జ‌బ్బుతో పాప ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంది.

ఆ జ‌బ్బు నుంచి బ‌య‌టప‌డాలంటే రూ.17 కోట్ల విలువైన ఇంజెక్ష‌న్ అవ‌స‌రమ‌ని సూచిస్తారు డాక్ట‌ర్లు. అంత డ‌బ్బును సైకో ఎలా సంపాదించాడు? త‌న బిడ్డ ప్రాణాల్ని కాపాడుకున్నాడా, లేదా? చిన్న పిల్ల‌ల అక్రమ రవాణాతో పాటు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేసే కార్టెల్ సంస్థ నడుపుతున్న వికాస్ మాలిక్ (న‌వాజుద్దీన్ సిద్ధిఖీ), మిత్ర (ముఖేష్ రుషి)తో సైంధ‌వ్ పోరాటం ఎలా సాగింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని