Suriya Jyothika: సూర్య- జ్యోతిక విహార యాత్ర.. ఫొటోలు వైరల్‌.. ఆ వార్తలకు ఫుల్‌స్టాప్‌!

సూర్య, జ్యోతిక.. ఫిన్లాండ్‌లో హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేశారు. సంబంధిత వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

Published : 31 Jan 2024 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాలతో బిజీగా ఉండే సూర్య (Suriya), జ్యోతిక (Jyothika) దంపతులు కాస్త విరామం తీసుకున్నారు. విహార యాత్రలో భాగంగా ఫిన్లాండ్‌ వెళ్లారు. అక్కడ గడిపిన ఆనంద క్షణాల్ని కెమెరాలో బంధించారు. ఆ దృశ్యాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఫొటోలు వైరల్‌గా మారాయి. ‘క్యూట్‌ కపుల్స్‌’, ‘వావ్‌’ అంటూ ఫ్యాన్స్‌, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు సంబంధిత పోస్ట్‌ను ‘లైక్‌’ చేశారు. సూర్య- జ్యోతిక విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలకు సదరు పోస్ట్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లైంది.

కొన్ని నెలలుగా జ్యోతిక ఎక్కువగా ముంబయిలో ఉండడంతో.. వీరిద్దరు విడిపోతున్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. విడాకులు తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కథనాలు వెలువెడ్డాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక వాటిపై స్పందించారు. ‘‘మా అమ్మా నాన్న ముంబయిలో ఉంటారు. వారి ఆరోగ్యం, పిల్లల చదువుతోపాటు నేను బాలీవుడ్‌లో సినిమాలు చేస్తుండడంతో ముంబయికి షిఫ్ట్‌ అయ్యా. అంతేగానీ సూర్యకు, నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఆయన మంచి మనిషి. ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తారు’’ అని జ్యోతిక తెలిపారు.

సూర్య.. ‘కంగువ’ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, మాధవన్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘షైతాన్‌’ మార్చి 8న విడుదల కానుంది. తుషార్ హీరానంద తెరకెక్కిస్తున్న ‘శ్రీ’తోపాటు మరో హిందీ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని