Bigg Boss 7 Telugu: అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలను ఉపేక్షించం: సజ్జనార్‌

బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Bigg Boss 7 Telugu) విజేతను ప్రకటించిన సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులపై జరిగిన దాడి ఘటనపై టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) స్పందించారు.

Updated : 18 Dec 2023 15:47 IST

హైదరాబాద్: బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Bigg Boss 7 Telugu) విజేతను ప్రకటించిన సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులపై కొంతమంది దుండగులు దాడి చేశారు. ఈ ఘటనపై టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) స్పందించారు. బస్సులపై దాడికి సంబంధించి జూబ్లీహిల్స్ పీఎస్‌లో మా సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.  ‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచివి కావు. ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్లే అవుతుంది. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించదు. ఆర్టీసీ బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని సజ్జనార్‌ తెలిపారు.

Bigg boss 7 telugu: అమర్‌, ప్రశాంత్‌ అభిమానుల మధ్య గొడవ.. ఆర్టీసీ బస్సు ధ్వంసం

ఆదివారం అర్ధరాత్రి బిగ్‌బాస్‌ సీజన్‌-7 విజేత ప్రశాంత్‌  (Pallavi Prashanth) అని తెలియగానే.. అతడి తరఫు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అమర్‌ (Amardeep), ప్రశాంత్‌ అభిమానులు మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. కృష్ణానగర్‌ వద్ద ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని