Salaar: నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో ‘సలార్‌’.. ఏయే స్థానాల్లో ఉందంటే..?

ఓటీటీలో ‘సలార్‌’ (Salaar) దూసుకెళ్తోంది. అత్యధిక వీక్షణలతో టాప్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Published : 22 Jan 2024 16:31 IST

హైదరాబాద్‌: భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌ అందుకున్న ‘సలార్‌’ (Salaar) ఓటీటీలోనూ అదే హవా కొనసాగిస్తోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ చిత్రం అత్యధిక వీక్షణలతో టాప్‌ ట్రెండింగ్‌లో దూసుకువెళ్తోంది. ‘సలార్‌’ తెలుగు వెర్షన్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ 1గా నిలవగా.. తమిళ వెర్షన్‌ రెండు, కన్నడ వెర్షన్‌ ఐదు, మలయాళం వెర్షన్‌ ఏడు స్థానాల్లో ఉన్నాయి. ‘ఖాన్సార్‌లో సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. ‘సలార్‌’ టాప్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది’ అని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది. దీనిపై ప్రశాంత్‌ నీల్‌ సతీమణి లిఖితారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సినీ ప్రియులు తప్పకుండా దీనిని వీక్షించాలని కోరారు.

Jai Hanuman: ‘జై హనుమాన్‌’.. ఆంజనేయుడిగా స్టార్‌ హీరో: ప్రశాంత్‌ వర్మ

‘ఆదిపురుష్‌’ తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రమిది. ఈ సినిమా కోసం తొలిసారి ప్రశాంత్‌నీల్‌తో వర్క్‌ చేశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా కోసం ఖాన్సార్‌ సామ్రాజ్యాన్ని ప్రశాంత్‌ సృష్టించారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు, శ్రియారెడ్డి కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలై దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ప్రభాస్‌పై చిత్రీకరించిన ఎలివేషన్‌ సీన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. చాలా రోజుల తర్వాత ఆయన్ని ఇలాంటి పవర్‌ఫుల్‌ రోల్‌లో చూడటంపై అభిమానులు సంతోషం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని