Jai Hanuman: ‘జై హనుమాన్‌’.. ఆంజనేయుడిగా స్టార్‌ హీరో: ప్రశాంత్‌ వర్మ

రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘హను-మాన్‌’ (Hanuman)కు కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) రానున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను ఉద్దేశించి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

Updated : 22 Jan 2024 14:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సూపర్‌ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి ప్రశాంత్‌ వర్మ (Prasanth varma) తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్‌’ (Hanuman). తేజ సజ్జా కథానాయకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. దీనికి కొనసాగింపుగా రానున్న ‘జై హనుమాన్‌’ (Jai hanuman)ను ఉద్దేశించి ప్రశాంత్‌ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీక్వెల్‌లో తేజ హీరో కాదని చెప్పారు. ‘హను-మాన్‌’ సక్సెస్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు.

Upcoming Movies: ఈ రిపబ్లిక్‌ డేకి.. థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

‘‘హను-మాన్‌’ కంటే వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్‌’ ఉండనుంది. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. సీక్వెల్‌లోనూ అతడు హనుమంతు పాత్రలో కనిపిస్తాడు. కానీ, ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రను స్టార్‌ హీరో చేస్తారు. 2025లో ఇది విడుదల కానుంది. దీనికంటే ముందు నా నుంచి మరో రెండు చిత్రాలు రానున్నాయి. అందులో ఒకటి ‘అధీర’. మరొకటి ‘మహాకాళి’’ అని ప్రశాంత్‌ చెప్పారు. టీమ్‌ సహకారంతోనే తాను ఈ విజయాన్ని అందుకోగలిగానన్నారు. రూ.45 కోట్ల బడ్జెట్‌తో ‘హను-మాన్‌’ తెరకెక్కింది. విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని